కన్నుగీటి బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతోంది. అందరూ ఆమెని వింక్ గర్ల్ అని పిలుస్తుండడం ఈమెకి నచ్చడం లేదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా ఈ విషయాన్ని వెల్లడించింది.

''ఒక్క వీడియోతోనే ఇంత ఫేమ్ రావడం నాకు సంతోషంగానే ఉంది కానీ జనాలు నన్ను వింక్ గర్ల్ అని పిలుస్తుంటే బాధగా ఉంటుంది. నెమ్మదిగా అది మారుతుందని అనుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది. 

రియల్ లైఫ్ లో ఎవరినైనా చూసి కన్ను కొట్టావా..? అని ప్రశ్నిస్తే వెంటనే స్పందించిన ప్రియా ప్రకాష్.. 'నో అతడికి పెళ్లైపోయింది' అంటూ రణవీర్ సింగ్ గురించి చెప్పింది. అతడికి పెళ్లి కావడంతో కన్ను కొట్టే అవకాశం పోయిందని ఈ విషయంలో కాస్త అప్సెట్ అయినట్లు తెలిపింది.

ప్రస్తుతం ప్రియా హిందీ, తమిళ బైలింగువల్ సినిమాలో నటిస్తోంది. అలానే ఆమె నటించిన 'ఒరు అడార్ లవ్' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.