ఒక్క వీడియోతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'ఒరు అడార్ లవ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను 'లవర్స్ డే' పేరుతో ఫిబ్రవరి 14న తెలుగులో విడుదల చేస్తున్నారు.

నిన్న జరిగిన సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి అల్లు అర్జున్ అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో ప్రియా ప్రకాష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె కట్టు, బొట్టు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంలో ఆమె ఎదపై ఉన్న టాటూ హాట్ టాపిక్ గా మారింది.

టాటూ ఆసక్తికరంగా కనిపించడంతో కెమెరా ఫ్లాష్ లు ఆ టాటూపైనే మెరిశాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆ టాటూ అర్ధం ఏంటో  తెలుసుకోవాలని గూగుల్ చేయడం మొదలుపెట్టారు.

'Carpe Diem'ప్రియా ఎదపై ఉన్న టాటూ ఇదే.. ఇది లాటిన్ భాషకి చెందిన పదం. దీనికి అర్ధమేంటంటే.. 'ఫ్యూచర్ మీద చిన్న ఆశ, నమ్మకంతో నేడు జీవించండి'.దీన్నే టాటూగా వేయించుకుంది ఈ బ్యూటీ. 
 

గాజు కళ్లతో మత్తెక్కిస్తోన్న ప్రియా వారియర్!