ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియోతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ సమయంలో ఆమెతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఎగబడ్డారు. సినిమాలు, వాణిజ్య ప్రకటనలతో బిజీగా మారిపోయింది. 

అయితే ఆమె నటించిన 'లవర్స్ డే' సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు.. అందులో ప్రియా నటనపై విమర్శలు  వినిపించాయి. దీంతో ఆమె క్రేజ్ బాగా తగ్గింది. మొదట్లో కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇరవై, పాతిక లక్షలకే సరిపెట్టుకుంటుంది.

నిజానికి నితిన్ హీరోగా, చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ ని అనుకున్నారు. ఆమెకి కోటి రూపాయలు ఆఫర్ కూడా చేశారు. ఇదంతా 'లవర్స్ డే' సినిమా రిలీజ్ కాకముందు. ఆ సమయంలో ప్రియా ప్రకాష్ తన మొదటి సినిమా రిలీజ్ అయ్యాక ప్రాజెక్ట్ సైన్ చేస్తానని చెప్పింది. 

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సైన్ చేసింది కానీ ఇరవై లక్షల రెమ్యునరేషన్ కే ఒప్పుకుంది. 'లవర్స్ డే' సినిమా సక్సెస్ అయితే కోటి కంటే ఎక్కువ డిమాండ్ చేయాలని ఆలోచించింది ఈ చిన్నది. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాతలు ఆమె రెమ్యునరేషన్ కూడా తగ్గించేశారు. తక్కువ మొత్తానికే ఆమె కూడా నటించడానికి సిద్ధమైంది.