మంచి చాన్స్ పోగొట్టుకున్న ప్రియా ప్రకాష్

Priya prakash out from surya's movie
Highlights

మంచి చాన్స్ పోగొట్టుకున్న ప్రియా ప్రకాష్

హీరోయిన్ ప్రియాప్రకాష్ వారియర్ గురించి లేటెస్ట్ న్యూస్. తమిళ నటుడు సూర్య త్వరలో చేయనున్న ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘ఒరు అధార్‌ లవ్‌’ మూవీ తర్వాత ప్రియా ఓకే చేసిన ప్రాజెక్ట్ సూర్యదే! ఇందులో సూర్య పక్కన హీరోయిన్‌గా ఓకే కావడంతో యూనిట్ కూడా షూట్ కోసం ప్లాన్ చేసింది. మరి ఏమైందో గానీ వారియర్ తప్పుకున్నట్లు కోలీవుడ్ సమాచారం. దీనిపై రకరకాలుగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై ప్రియా మాట్లాడితేనే లోగుట్టు బయటపడుతుంది.

ఒరు అధార్‌ లవ్‌’ ఫిల్మ్‌లోని ఓ పాటతో స్టార్‌డమ్ తెచ్చుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె కనుసైగతో యూత్‌ ని హీటెక్కించింది. దీంతో ప్రియాకు కోలీవుడు, టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడం మొదలైంది. ఐనా, వాటిని హోల్డ్‌లో పెట్టింది ఈ బ్యూటీ. ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాతే గ్లామర్ ఇండస్ర్టీపై ఫోకస్ పెడతానని ఒకానొక సందర్భంలో చెప్పింది. అందుకే సూర్య మూవీ నుంచి డ్రాపైనట్లు చర్చించుకుంటున్నారు.

loader