కన్నుగీటి బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క కన్నుగీటితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తనవైపు చూసేలా చేసుకుంది. యూత్ లో ఆమెకి ఫాలోయింగ్ మాములుగా లేదు.

ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ప్రియా వారియర్ కి అవకాశాలు వస్తున్నాయి. ఆమె నటించిన 'ఒరు అడార్ లవ్' సినిమా వచ్చే ఏడాది ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను 'లవర్స్ డే' పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా తెలుగు రైట్స్ దక్కించుకున్న నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం చాలా మంది ప్రయత్నించారని, ఫైనల్ గా తమకు దక్కాయని అన్నారు. తెలుగులో కూడా ఫిబ్రవరి 14న సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.