మరో సారి రెచ్చిపోయిన ప్రియా ప్ర‌కాశ్ .. వైర‌ల్ (వీడియో)

priya prakash is bac with yet another cute video
Highlights

ఈ చిత్రంలోని 40 శాతం స‌న్నివేశాల‌ని రీషూట్ చేయాల‌ని చిత్ర బృందం భావించింద‌ట

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ని ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. త‌ను నటించిన తొలి చిత్రం ఒరు ఆదార్ ల‌వ్‌. ఈ మ‌ల‌యాళ మూవీలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాట‌లో త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో యువ‌త గుండెల్లో బాణాలు దించింది ప్రియా. 18 ఏళ్ళ ఈ భామ‌కి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ రోజు రోజుకి పెరుగుతూ పోతున్నారు. ఈ అమ్మ‌డు న‌టించిన ఒరు ఆదార్ ల‌వ్ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

ఇప్పుడు ఈ చిత్రంలోని 40 శాతం స‌న్నివేశాల‌ని రీషూట్ చేయాల‌ని చిత్ర బృందం భావించింద‌ట‌. ఒరు ఆదార్ మూవీలో మొత్తం న‌లుగురు హీరోయిన్స్ ఉండ‌గా అందులో ప్రియా వారియ‌ర్ ఒక‌రు. సినిమాలో ఆమె పాత్ర కేవ‌లం 15 నుండి 20 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ట‌. అయితే క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్ తో అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ప్రియా పాత్ర‌ని కాస్త పెంచి మూవీపై జ‌నాల‌లో ఆసక్తిని క‌లిగించాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. 

loader