ఈ సినిమాలో మళయాళ స్టార్  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా కీలకమైన పాత్ర చేసారు. ఆయనకు ఎంత ఇచ్చి ఉంటారనేది హాట్ టాపిక్ గా మారింది. 

 రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సలార్. ప్రీ బుకింగ్స్ నుంచే సునామీ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ వీకెండ్ మాత్రమే కాకుండా మరో పదిహేను రోజులు పాటు ఈ సినిమా బాక్సాఫీస్‍ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఆసక్తికరమైన విశేషాలు బయిటకు వరస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి ఎవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనేది. 

ప్రభాస్ కు వంద కోట్లు ,లాభాల్లో వాటాగా రెమ్యునరేషన్ సెట్ చేసారని తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మళయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా కీలకమైన పాత్ర చేసారు. ఆయనకు ఎంత ఇచ్చి ఉంటారనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు..పృద్వీరాజ్ కు నాలుగు కోట్ల రూపాయలు వరదరాజ మన్నార్ పాత్ర చేయటానికి ఇచ్చారని సమాచారం. ప్రభాస్ తో సమానమైన కీలకమైన పాత్ర కావటంతో మారు మాట్లాడకుండా ఓకే చేసారని తెలుస్తోంది. అలాగే మళయాళ రైట్స్ లో కూడా మేజర్ షేర్ ఉందని వినికిడి. 

ఇక ఈ చిత్రం కేరళలోనూ దుమ్ము రేపుతోంది. అక్కడ మొదటి రోజు ఆన్లైన్ బుకింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేరళలోనూ భారీ ఎత్తున విడుదలైన ఈచిత్రం ఆన్ లైన్ బుక్కింగ్స్ నిమిషాల్లోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. మొదట మార్నింగ్ షో నుంచి రాత్రి సెకండ్ షో వరకు ఒక్క షోకి కూడా టికెట్లు ఖాళీ లేకుండా నిమిషాల్లోనే ఫీల్ అయిపోయాయి. మరో ప్రక్క అంతటా చిత్రం కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో శనివారం, ఆదివారం టికెట్లు కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ అవుతూ వచ్చాయి.

 #Salaar Ceasefire 1 చిత్రం బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేసారు. శ్రుతిహాసన్‌ (salaar heroine) హీరోయిన్‌. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రతినాయకుడు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘సలార్‌’.. ‘కేజీయఫ్‌’ యూనివర్స్‌ కు సంబంధం ఉండదని సినిమా స్పష్టం చేసింది.

బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్. ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. అదే నిజమైంది.