`సలార్` నుంచి అప్‌డేట్ ఇచ్చింది టీమ్. సినిమాలో నెగటివ్ రోల్ చేసిన పృథ్వీరాజ్ సుకుమార్ తన పాత్రకి డబ్బింగ్ పూర్తి చేశారు. అయితే ఆయన ..
పృథ్వీరాజ్ సుకుమారన్.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ మొదటి సారి `సలార్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రమిది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ మూవీ రిలీజ్‌కి మరో 12 రోజులు మాత్రమే ఉంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో స్లోగా మూవ్ అవుతుంది యూనిట్.
ఇటీవల `సలార్` ట్రైలర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశకి గురయ్యారు. సాధారణ ఆడియెన్స్ సైతం పెదవి విరిచారు. ప్రభాస్ ని ఊహించిన స్థాయిలో కనిపించలేదు. ఆయన డైలాగ్‌లు కూడా అసంతృప్తికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా జరుగుతుందని లేటెస్ట్ అప్‌డేట్‌ని బట్టి అర్థమవుతుంది
తాజాగా `సలార్` నుంచి అప్‌డేట్ ఇచ్చింది టీమ్. సినిమాలో నెగటివ్ రోల్ చేసిన పృథ్వీరాజ్ సుకుమార్ తన పాత్రకి డబ్బింగ్ పూర్తి చేశారు. అయితే ఆయన లేటెస్ట్ డబ్బింగ్ కరెక్షన్ చేశారు. ఆయనే సొంతంగా ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకు తాను ఇతర భాషల్లో చేసిన సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్టు తెలిపారు. కానీ ఒకే పాత్రకి ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటి సారి అని ఆయన వెల్లడించారు. ఇదొక కొత్త అనుభవం అని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 22న థియేటర్లలో దేవా, వరదాలు మిమ్మల్ని కలవబోతున్నారు అని తెలిపారు.
అయితే సినిమా విడుదలకు ఇంకా 11 రోజులే ఉంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందంటే.. ఇంకెప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్‌లో భాగంగా దాదాపు ఐదు సిటీస్ కవర్ చేయాల్సి ఉంటుంది, విదేశాల్లోనూ ప్రమోషనల్ ఈవెంట్ చేయాల్సి ఉంటుంది. మరి అవన్నీ ఎప్పుడు చేస్తారు, అసలు చేస్తారా? లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పటికే ట్రైలర్‌పై నెగటివ్ కామెంట్ వచ్చాయి. దీంతో సరైన ప్రమోషన్స్ చేయకపోతే ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే `సలార్` ట్రైలర్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో మరో ట్రైలర్‌ని విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
