BiggBoss7: ఎవిక్షన్ పాస్ లో బిగ్ ట్విస్ట్.. నాకు అవసరం లేదు అంటూ నాగ్ ముందే పక్కన పెట్టేసిన యావర్

చివర్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏవిక్షన్ పాస్ టాస్క్ లలో యావర్ పూర్తిగా రూల్స్ బ్రేక్ చేసి ఆడినట్లు నాగార్జున వీడియో చూపించారు. దీనితో యావర్ నేను తప్పుగా గేమ్ ఆడి ఉంటే తనకి ఈ ఎవిక్షన్ పాస్ అవసరం లేదని.. అందుకు తాను అర్హుడిని కాదని నాగార్జునకి చెప్పేశాడు.

Prince yawar rejects bigg boss telugu 7 eviction free pass dtr

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 లో 11 వారాలు గడచిపోయాయి. సీజన్ చివరికి చేరే కొద్దీ ఉత్కంఠ పెరిగిపోతోంది. శివాజీ, ప్రియాంక, యావర్, శోభా శెట్టి, అర్జున్ లాంటి బలమైన కంటెస్టెంట్స్ పోటాపోటీగా రాణిస్తున్నారు. యావర్ ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు. హౌస్ కి కొత్త కెప్టెన్ గా ప్రియాంక ఎంపికైంది. 

ఇక శనివారం వీకెండ్ ఎపిసోడ్ కి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వగానే సీసా తలమీద పగల కొట్టి తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అని అన్నారు. ముందుగా నాగార్జున కొత్త కెప్టెన్ ప్రియాంక ని అభినందించారు. ఇక నాగార్జున ఒక్కొక్కరిని పైకి లేపి వారి ఫోటోపై సీసా పగలగొడుతూ వాళ్ళు ఈ వారంలో చేసిన తప్పులని ఎత్తి చూపారు. 

ముందుగా శివాజీ ఫోటోపై నాగ్ సీసా పగలగొట్టారు. శివాజీ హౌస్ లో తరచుగా బూతులు మాట్లాడుతుండంతో నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పోహా, పిచ్చి నాయాల ఇలాంటి పదాలు ఇకపై హౌస్ లో బ్యాన్ అని నాగ్ ప్రకటించడమే కాదు శివాజీకి వార్నింగ్ ఇచ్చారు. శివాజీ ఆ పదాలు సరదాగా మాట్లాడినవే అని చెడు ఉద్దేశంతో తిట్టాలని అనలేదని అన్నారు. 

అలాగే ధనుస్సుని బ్యాలన్స్ చేసే ఎవిక్షన్ పాస్ టాస్క్ లో శివాజీ.. సంచాలక్ శోభాతో గొడవ పెటుకోవడాని కూడా నాగార్జున ప్రశ్నించారు. శోభా గతంలో సంచాలక్ గా తప్పులు చేసింది అని ఇప్పుడు అలాంటి తప్పులు చేయకుండా హెచ్చరించినట్లు శివాజీ వివరణ ఇచ్చారు. నాగార్జున అర్జున్ అభిప్రాయం అడగగా.. ఆ టాస్క్ లో తన దృష్టిలో ప్రియాంక విన్నర్ అని తెలిపాడు. 

ఇక నాగార్జున కెప్టెన్సీ టాస్క్ లో అమర్ ఏడుస్తూ ఆడడం గురించి అడిగారు. అలా ఏడుస్తూ ఆడితే గేమ్ పై ఫోకస్ పోతుంది అని అన్నారు. రతికపై నాగార్జున కాస్త ఎక్కువగానే ఫైర్ అయ్యారు. అందరి ఫోటోలపై ఒక్కొక్క సీసా పగులగొట్టిన నాగ్.. రతిక ఫోటో పై మాత్రం మూడు సీసాలు పగలగొట్టారు. అసలు రతిక టాస్క్ లలో ఏమాత్రం యాక్టివ్ గా లేదని హెచ్చరించారు. 

ఇక చివర్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏవిక్షన్ పాస్ టాస్క్ లలో యావర్ పూర్తిగా రూల్స్ బ్రేక్ చేసి ఆడినట్లు నాగార్జున వీడియో చూపించారు. దీనితో యావర్ నేను తప్పుగా గేమ్ ఆడి ఉంటే తనకి ఈ ఎవిక్షన్ పాస్ అవసరం లేదని.. అందుకు తాను అర్హుడిని కాదని నాగార్జునకి చెప్పేశాడు. నాగార్జున ఇంటి సభ్యుల అభిప్రాయం అడిగారు.. యావర్ ఎవిక్షన్ పాస్ కి అర్హుడా కాదా అని.. ముగ్గురు మాత్రమే కాదు అని చేతులు ఎత్తారు. అయినప్పటికీ యావర్ తనకు ఎవిక్షన్ పాస్ అవసరం లేదు అని చెప్పడంతో నాగార్జున అతడి నిర్ణయం ప్రకారమే దానిని వెనక్కి తీసేసుకున్నారు. చివర్లో ప్రశాంత్ రతికపై చెప్పిన కవితతో నేటి ఎపిసోడ్ సరదాగా ముగిసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios