కోలీవుడ్ స్టార్ శివ కార్తీకేయన్, టాలీవుడ్ యువ దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం ‘ప్రిన్స్’. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా.. తాజగా ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ అందించారు మేకర్స్.
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ (Siva Kartikeyan)కు అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన నటకు తెలుగు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. కోలీవుడ్ లో నేచురల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న శివకార్తికేయన్ తెలుగులో ‘రెమో’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ఇక్కడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆయనకు ఫ్యాన్ ఫోలోయింగ్ పెరిగిపోయింది. దీంతో నేరుగా తెలుగులోనే యువ దర్శకుడు అనుదీప్ కేవీ (Anudeep KV) డైరెక్షన్ లో సినిమాను చేస్తున్నాడు శివ కార్తికేయన్.
‘జాతి రత్నాలు’తో మంచి హిట్ కొట్టిన తర్వాత అనుదీప్ మంచి జోష్ లో ఉన్నారు. దీంతో వెంటనే సౌత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో శివ కార్తికేయన్ తో వెంటనే సినిమాను ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మూవీ రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి మేకర్స్ ‘ప్రిన్స్’ (Prince) అనే టైటిల్ ఫైనల్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా మేకర్స్ చిత్రానికి సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్ ను అందించారు.
చిత్రం నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేశామని అనౌన్స్ చేశారు. ‘ఫస్ట్ సింగిల్ లోడింగ్’ అంటూ తాజాగా అప్డేట్ అందించారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరోయిన్, హీరో ఒక గోడపై కూర్చొని డైరీని చదువుతున్నట్టు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే హైదరబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఓ ఆసక్తికరమైన సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు తెలుస్తోంది. తొలిసారిగా కోలీవుడ్ స్టార్ తెలుగులో సినిమా చేస్తుండటం, అందులోనూ నవ్వులు పూయిస్తున్న డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా షూటింగ్ చెన్నైలో రెండు నెలల కిందనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. చిత్రంలో హీరోయిన్ గా మారియా ర్యా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 31న రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు.
