ప్రధాని నరేంద్రమోడీ గురువారంతో తన 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ పుట్టిన రోజున దేశ వ్యాప్తంగా ఓ పండుగ వాతావరణం నెలకొంది. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విదేశీ నాయకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

సినీ సెలబ్రిటీలు సైతం ట్విట్టర్‌ ద్వారా ఆయనకు విశెష్‌ తెలిపారు. అయితే ప్రతి ఒక్కరికి మోడీ ప్రతిస్పందిస్తూ వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్‌చ, కమల్‌ హాసన్‌, మోహన్‌లాల్‌, మహేష్‌బాబు, అనిల్‌ కపూర్‌ ఇలా అనేక మందికి మోడీ రిప్లై ఇవ్వడం విశేషం. మోడీ ట్విట్టర్‌లో ఏం చెప్పారో మీరే చూడండి.