రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళయాళంతో సమానంగా ఇక్కడా అదరించారు.
రీసెంట్ గా తెలుగులో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా మళయాళ డబ్బింగ్ చిత్రం ప్రేమలు(Premalu). ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. నస్లీన్(Naslin), మమితా బైజు(Mamitha baiju) జంటగా వచ్చిన ఈ సినిమాను గిరీష్ ఏడీ తెరకెక్కించగా.. భావన స్టూడియోస్ పై ఫహద్ ఫాసిల్, శ్యామ్ పుష్కరన్, దిలీష్ పోతన్ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మళయాళంతో సమానంగా ఇక్కడా అదరించారు. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించారు.
ప్రేమలు సినిమా ఏప్రిల్ 12వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రావడం ఖరారైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఆరోజున హాట్‍స్టార్ ఓటీటీలో ఆ మూవీ స్ట్రీమింగ్‍కు రానున్నట్టు తెలుస్తోంది. హిందీ, కన్నడ వెర్షన్‍లపై అప్‍డేట్ లేదు. ఏప్రిల్ 12వ తేదీ అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ప్రేమలు సినిమా మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ రావడం దాదాపు ఖరారైంది. ఈ విషయంపై హాట్‍స్టార్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసింది.
ముఖ్యంగా ఈ సినిమాను తెలుగులో రాజమౌళి కుమారుడు కార్తికేయ విడుదల చేయడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. కథ కూడా హైదరాబాద్ చుట్టూ తిరగడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో.. దుమ్ములేపే కలెక్షన్స్ రాబట్టింది ప్రేమలు. ఈ క్రమంలో మలయాళ టాప్ స్టార్స్ ని సైతం పక్కకు నెట్టేసి తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది ప్రేమలు. తెలుగులో ఈ సినిమా విడుదలై 20 రోజులు గడుస్తున్నా.. కలెక్షన్స్ జోరు మాత్రం అస్సలు తగ్గడంలేదు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ కావడం విశేషం. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా ప్రేమలు సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడలి.
