హీరోయిన్ మమిత బైజు అభిమానుల మధ్య చిక్కుకొని అల్లాడిపోయింది. కుర్రాళ్ళు ఆమెను చుట్టుముట్టగా విపరీతమైన ఆందోళనకు గురైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.  

ప్రేమలు చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది మమిత బైజు. ఈ మలయాళ కుట్టి క్యూట్ నెస్ కి యూత్ పడిపోయారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మమిత బైజు జపం చేస్తున్నారు. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ప్రేమలు రూ. 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఏ స్థాయిలో ప్రేమలు చిత్రం లాభాలు పంచిందో అంచనా వేయవచ్చు. ప్రేమలు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. 

ప్రేమలు చిత్ర నిర్మాతల్లో ఫహాద్ ఫాజిల్ కూడా ఒకరు. ప్రేమలు చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. కాగా ప్రేమలు మూవీ సక్సెస్ నేపథ్యంలో మమిత బైజుకు సౌత్ ఇండియాలో క్రేజ్ పెరిగింది. ఆమెకు పబ్లిక్ లో అడుగుపెడితే కుర్రాళ్ళు చూసేందుకు ఎగబడుతున్నారు. కాగా చెన్నైలో మమిత బైజుకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె కుర్రాళ్ల మధ్య చిక్కుకుపోయారు. అతి కష్టం మీద బయటపడ్డారు. 

చెన్నై నగరంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం మమిత బైజు వచ్చింది. ఆమె వస్తున్నారని తెలుసుకున్న యువత పెద్ద మొత్తంలో అక్కడకు చేరుకున్నారు. మమితను చూసేందుకు, సెల్ఫీల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. మమిత చుట్టూ చెప్పుకోదగ్గ సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. దాంతో జనం మధ్య మమిత నలిగిపోయింది. ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. అతికష్టం మీద జనాల మధ్య నుండి బయటపడింది. 

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు తెలుగులో మమిత బైజుకు ఆఫర్స్ పెరుగుతున్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రం కోసం ఆమెను సంప్రదించారని టాక్. గతంలో మమిత చాలా చిత్రాల్లో నటించారు. కానీ ప్రేమలు ఆమెకు పిచ్చ క్రేజ్ తెచ్చిపెట్టింది. తెలుగులో మమిత చిత్రాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Scroll to load tweet…