పేదరికంలో మగ్గే అనసూయని చూశారా?.. ఇంట్రెస్టింగ్‌గా `ప్రేమ విమానం` ట్రైలర్..
`విమానం` చిత్రంలో వేశ్యగా కనిపించి ఆశ్చర్యపరిచిన అనసూయ ఇప్పుడు పేదింటి ఇళ్లాలుగా మారిపోయింది. మరోవైపు `మ్యాడ్`లో రచ్చ చేసిన సంగీత్ ఇప్పుడు ప్రేమ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు.

అనసూయ ఇటీవల `పెదకాపు` చిత్రంతో ఆకట్టుకుంది. బలమైన పాత్రతో మెప్పించింది. అంతకు ముందు `విమానం` చిత్రంతో వేశ్యగా మెరిసింది. ఇప్పుడు `ప్రేమ విమానం` అంటూ రాబోతుంది. తాజాగా `మ్యాడ్` చిత్రంతో రచ్చ రచ్చ చేసిన సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటించగా, శాన్వీ మేఘన కథానాయికగా నటించింది. అనసూయ, వెన్నెల కిషోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ కటా దర్శకత్వం వహించిన వెబ్ ఫిల్మ్ ఇది. దీన్ని అభిషేక్ పిక్చర్స్, జీ5 పతాకాలపై అభిషేక్ నామా నిర్మించారు. తాజాగా ఈ వెబ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
తెలంగాణ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో రెండు కథలను పారలల్‌గా నడిపించారు. ఒకటి పేదింటి సంగీత్ శోభవన్, పెద్దింటి శాన్వీ మేఘన మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరి ప్రేమకి కులం, ధనం అడ్డంకి అవుతుంది. మరోవైపు పేదరికంలో మగ్గే అనసూయ పిల్లలకు విమానం అంటే పిచ్చి. ఎలాగైనా విమానం ఎక్కేందుకు ఓ ప్లాన్ చేస్తారు. సిటీకి వెళ్ళి విమానం ఎక్కాలనుకుంటారు. అలాగే తమ ప్రేమని బతికించుకోవడానికి సంగీత్, శాన్వీ సైతం సీటీనే ఎంచుకుంటారు. మరి ఈ గమ్యాన్ని చేరే క్రమంలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? లక్ష్యం చేశారా? వారి ప్రయాణం ఎలా సాగింది, ఊర్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి అనేది ఆవిష్కరించేలా ఈ ట్రైలర్ సాగింది.
విమానం ఎక్కాలనే తమ పిల్లల కలలను నెరవేర్చేందుకు అనసూయ ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొంది? అనేది ఇందులో ఆసక్తికరం. అలాగే ప్రేమ కోసం సంగీత్ చేసే పోరాటం ఆద్యంతం హృదయాన్ని కదిలిస్తుందని అంటున్నారు దర్శకుడు సంతోష్ కటా. భావోద్వేగాలు మనిషిని ముందుకు నడిపిస్తాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో ఎమోషన్ ఉంటుంది. అది సాధిస్తే చాలు అనుకుంటారు వాళ్లు. బయట నుంచి చూసే వారికి ఇదేంటని అనిపించినా.. వారికి మాత్రం అదే ముఖ్యమనిపిస్తుంది. అలాంటి ఎమోషన్స్ ఉన్న కొందరి మనుషుల కథతో రూపొందుతోన్న వెబ్ ఫిల్మ్ ‘పేమ విమానం’లో ఆవిష్కరించినట్టు చెప్పారు దర్శకుడు. వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయన్నారు.
విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది. అక్టోబర్ 13న జీ 5 ద్వారా ఓటీటీలో విడుదల కాబోతుంది. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.