చూడకపోవడమే ఉత్తమమ్ (‘ప్రేమ కథా చిత్రమ్’ 2 రివ్యూ)

తెలుగు ప్రేక్షకులపై హారర్ సినిమాల దాడి ఇంకా పూర్తి కాలేదు. వారానికి ఒకటో రెండు దెయ్యం కథలు వంతలేసుకుని మరీ  ధియోటర్లో  చెప్పబడుతున్నాయి. 

Prema Katha Chitram 2 Movie Review & Rating

-----సూర్య ప్రకాష్ జోస్యుల 

తెలుగు ప్రేక్షకులపై హారర్ సినిమాల దాడి ఇంకా పూర్తి కాలేదు. వారానికి ఒకటో రెండు దెయ్యం కథలు వంతలేసుకుని మరీ  ధియోటర్లో  చెప్పబడుతున్నాయి. డబ్బింగ్ అయినా స్ట్రైయిట్ అయినా దాదాపు దెయ్యం సినిమానే దిగుతోంది.  అయితే ఈ దెయ్యం కథలు ప్రేక్షకులని భయపెట్టడం ఎప్పుడో మానేసాయి.

కథలో దెయ్యం ఎప్పుడు వస్తుందో..ఎలా భయపెడుతుందో...వాటి ఫ్లాష్ బ్యాక్ లు ఏమిటో..క్లైమాక్స్ లో ఎలా కడతేరుతాయో ఉట్టినే ఊహించేస్తున్నాడు సగటు ప్రేక్షకుడు. ఈ నేపధ్యంలో ఈ ట్రెండ్ కు తెర తీసిన ‘ప్రేమ కథా చిత్రమ్’కు సీక్వెల్ ...ఇది మరింత స్పెషల్ అంటూ ఈ సినిమా వచ్చింది. నిజంగానే ఈ సినిమా అప్పటి సినిమా స్దాయిలోనే నవ్వించిందా..భయపెట్టిందా...ఫైనల్ గా ఏం చేసింది అనేది రివ్యూలో చూద్దాం.

 

కథేంటి...

సుదీర్ (సుమంత్ అశ్విన్)తో ప్రేమలో పడిన  బిందు (సిద్ది ఇద్నాని) ప్రపోజ్ చేస్తుంది. కానీ అప్పటికే సుదీర్ ...నందు (నందితా శ్వేతా)తో ప్రేమలో ఉండటంతో.... బిందు ను రిజెక్ట్ చేస్తాడు.దాంతో విరక్తి చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అప్పుడు సుదీర్ కాపాడి నచ్చచెప్పి వెళ్లిపోతాడు.  ఆ తర్వాత కొద్ది కాలానికి  సుదీర్ తో ఏకాంతగా గడపడం కోసం  నందు ఒక ఫామ్ హౌస్ కి తీసుకోస్తోంది.  ఫాం హౌస్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి సుధీర్‌కు విచిత్రమైన అనుభవాలు ఎదురౌతాయి.  అక్కడ చిత్ర అనే దెయ్యం నందులో ప్రవేశించిందని అర్దమవుతుంది.

దాన్ని నుంచి తప్పించుకుని తనను, తన లవర్ ని కాపాడుకుందామనుకునేలోగా ఆ దెయ్యం.. సుధీర్ లో ప్రవేసిస్తుంది. దాంతో, నందు,సుధీర్ ఒకరినొకరు చందుకునే పరిస్దితులు ఎదురౌతాయి.  అసలు ఈ చిత్ర దెయ్యం ఎవరు..అది దెయ్యంగా ఎందుకు మారింది...మారితే మారింది...మధ్యలో సుదీర్ మీద ఎందుకు ఎటాక్ చేస్తోంది. వాళ్లిద్దరి మధ్యా గతంలో ఏదన్నా జరిగిందా..చివరకు సుదీర్, నందు ఎలా దెయ్యం బారి నుంచి బయిటపడ్డారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

ఎలా ఉందంటే...

ఈ సినిమా కేవలం ప్రేమ కథా చిత్రమ్ అనే టైటిల్ కు ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి అల్లిన కథే అని అర్దమవుతుంది. చాలా చీప్ గా సాగే సీన్స్, బోర్ కొట్టించే కామెడీ సీన్స్ తో సినిమా ఫస్ట్ నుంచి చివరి వరకూ సాగుతుంది. ఫస్టాఫ్ లో అయితే అసలు తెరపై ఏం జరుగుతోందనే క్లారిటీ కూడా మనకు ఉండదు. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి అయితే దెయ్యం ..హీరో ప్రేమలో ఉండే గొప్పతనాన్ని  నమ్మి వదిలేస్తుందనే విషయం డైజస్ట్ కాదు. 

 

హైలెట్స్ ..మైనస్ లు.

సినిమాలో ఏమన్నా బాగున్నాయి అంటే కొన్ని హారర్ సీన్స్ మాత్రమే అని చెప్పాలి. అలాగే  కృష్ణతేజ(బబ్లూ), విధ్యుల్లేఖ రామన్‌ కామెడీ ఫరవాలేదు. అంతకు మించి చెప్పుకునేందుకు పెద్దగా హైలెట్స్ లేవు. ఇక మైనస్ లలో ఈ సినిమాకు కథే , కథనం పెద్ద మైనస్. అలాగే దర్శకత్వం కూడా కథకు తగ్గట్లే దారుణంగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే ఇక చెప్పక్కర్లేదు. చుట్టేసారు..లేదా ఉప్మా సినిమా అనే పదానికి సరైన అర్దంగా నిలుస్తుంది.

 

టెక్నికల్  గా...

కెమెరా వర్క్ ఫరవాలేదు. సంగీతం అయితే మహా నస.డైలాగ్స్ ఓకే. ఈ సినిమా చూడటమే ఓ హర్రర్ ఎక్సపీరియన్స్ లా దర్శకుడు మార్చేసారు. 

 

ఫైనల్ ధాట్

‘ప్రేమ కథా చిత్రమ్’తో మొదలైన ఈ హారర్ కామెడీల ట్రెండ్ ‘ప్రేమ కథా చిత్రమ్ -2’తో అయినా బ్రేక్ పడితే బాగుండును.

 

నటీనటులు: సుమంత్ అశ్విన్, నందితా శ్వేత, సిద్ధి ఇద్నానీ, విద్యుల్లేఖ రామన్, కృష్ణ తేజ, ప్రభాస్ శ్రీను తదితరులు దర్శకత్వం: హరి కిషన్

 నిర్మాత: సుదర్శన్ రెడ్డి

 కథ: చంద్రశేఖర్

 మ్యూజిక్: జీవన్ బాబు 

సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్ 

ఎడిటింగ్: ఎస్‌బీ ఉద్దవ్

రిలీజ్: 2019-04-06

Rating: 1/5

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios