పిల్లల ఫోటోలు తీయడానికి ప్రయత్నించే వారిపై ప్రీతి జింటా తన కోపాన్ని వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఫోటోలు లేదా వీడియోలు తీయవద్దని అభిమానులను కోరింది.
పిల్లల ఫోటోల గురించి ప్రీతి కోపం : ఐపీఎల్ 2025లో కొన్ని రోజుల విరామం తర్వాత ప్రీతి జింటా ప్రస్తుతం తన కవల పిల్లలు, జై మరియు జియాతో సమయం గడుపుతోంది. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో సంభాషిస్తోంది. ఇటీవల ఒక సెషన్ నిర్వహించి కొన్ని ప్రశ్నలకు ఆశ్చర్యకరమైన సమాధానాలు ఇచ్చింది. ప్రజలు తన పిల్లల ఫోటోలు తీయడానికి లేదా షేర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తనకు చాలా కోపం వస్తుందని ప్రీతి జింటా వెల్లడించింది.
ప్రీతి జింటా 'నో ఫోటో' రూల్
ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో AMA సెషన్ సందర్భంగా, ఒక అభిమాని ప్రీతిని "సాధారణ ప్రజలకు మీ గురించి తెలియని ఒక విషయం ఏమిటి?" అని అడిగాడు. దానికి ప్రీతి "నాకు ఆలయాల్లో, ఫ్లైట్ తర్వాత ఉదయాన్నే, బాత్రూంలో, భద్రతా తనిఖీల సమయంలో ఫోటోలు తీయడం అస్సలు ఇష్టం ఉండదు! మీరు పైన చెప్పిన సందర్భాల్లో తప్ప, ఫోటో కావాలంటే అడగడమే ఉత్తమ మార్గం" అని చెప్పింది.
'కాళి' అవతారం ప్రీతిది
"నా పిల్లల ఫోటోలు తీస్తే నాలోని 'కాళి' బయటకు వస్తుంది. అసలు నేను చాలా సరదా మనిషిని. నా అనుమతి లేకుండా వీడియోలు తీయడం మొదలు పెట్టకండి - ఇది చాలా ఇబ్బందికరం - నన్ను నేరుగా అడగండి, దయచేసి నా పిల్లలను వదిలేయండి.
I hate taking pictures in temples, early in the morning after a flight, in bathrooms and during security checks ! Asking me for a photo is the best way to get a photo unless you are asking for pictures in the above situations ! Taking my kids pictures will bring out my Kali… https://t.co/oYuIIEYZlq
చాట్ ముగింపులో ప్రీతి "మరో సరదా చాట్ కి అందరికీ ధన్యవాదాలు! ఏ ఇంటర్వ్యూ కంటే ఈ చాట్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ప్రశ్నలు చాలా బాగుంటాయి లేదా చాలా వింతగా ఉంటాయి. మీడియా వారికి కూడా నా మొత్తం సమాధానం రాయమని, దాన్ని కత్తిరించి వాడకండి అని కోరుకుంటున్నాను.


