టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారిన సంగతి తెలిసిందే. వారికి తగ్గ జోడీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్యకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేయనున్నారు.

ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇందులో హీరోయిన్ గా నటి సమీరా రెడ్డిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో 'అశోక్', 'జై చిరంజీవ' వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.

ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్. తన రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తాను సినిమా ఇండస్ట్రీకి దూరం కాలేదని అవకాశాల కోసం చూస్తున్నానని ఇటీవల సమీరా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమెని బాలయ్య సినిమాలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం సమీరా ఉన్న పరిస్థితిలో బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కనీసం మూడు, నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవాల్సివుంటుంది. మరి ఏ విధంగా ఆమెని హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నారనే విషయంలో క్లారిటీ లేదు. కానీ చిత్రబృందం నుండి ఆమె ఫోన్ వచ్చినట్లు.. కాల్షీట్స్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. మరోపక్క శ్రియా, మెహ్రీన్, తమన్నా లాంటి వారిని కూడా సంప్రదిస్తున్నారు.