బాహుబలి సినిమాతో ఐదేళ్లు గడిపిన ప్రభాస్ మరో సినిమాను రిలీజ్ చేయడానికి మరో రెండేళ్లు సమయం తీసుకుంటున్నాడు. గత ఏడాది సమ్మర్ లో వచ్చిన బాహుబలి 2 తరువాత సాహో ను ఇప్పటికే రిలీజ్ చేస్తారని అంతా భావించారు. కానీ ఆ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తవ్వలేదు. 2019 లో సమ్మర్ తరువాత అంటున్నా డౌట్ గానే ఉంది. 

ఇకపోతే రీసెంట్ గా ప్రభాస్ 20వ సినిమాను స్టార్ట్ చేసిన జిల్ దర్శకుడు రాధాకృష్ణ తన సినిమా మాత్రం ఫాస్ట్ గానే ఫినిష్ అవుతుందని చెబుతున్నాడు. ప్రభాస్ తో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీనితెరకెక్కిస్తున్న ఈ డైరెక్టర్ 2019 ఎండింగ్ కు వచ్చే సరికి షూటింగ్ ఫినిష్ చేస్తాడట. ఇప్పటికే యూరోప్ లో కీలకమైన షెడ్యూల్ ని ఫినిష్ చేశారు. ప్రభాస్ కూడా ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం లేదు. 

మొన్న సాహు యాక్షన్ సీక్వెన్స్ అనంతరం రెండు వారలు రెస్ట్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ రాధాకృష షూటింగ్ ని కవర్ చేసి వేగంగా ముందుకు సాగుతున్నాడు. రెండు సినిమాలను వీలైనంత త్వరగా ఫినిష్ చేసే పెద్దగా గ్యాప్ లేకుండా ఆడియెన్స్ కి యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ సినిమాలను అందించాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.