టాలీవుడ్ లో 'త్రీ కజిన్స్' వాళ్ళే!

First Published 8, Dec 2017, 6:47 PM IST
Praveen sattaru bracing up to make mutli starer with Rana nitin and nara rohit
Highlights

మరో మల్లీ స్టారర్ కు సిద్ధమవుతున్న రానా

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా పెరుగుతోంది. స్టార్ హీరోలు సైతం ఇతర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇటీవలే దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను హీరోలుగా పెట్టి మల్టీస్టారర్ ప్లాన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

అయితే ఇప్పుడు భళ్లాలదేవ రానా, యంగ్ హీరో నితిన్, నారా రోహిత్ లతో ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రీసెంట్ గా 'గరుడ వేగ' చిత్రంతో సక్సెస్ అందుకున్న ప్రవీణ్ సత్తారు.. తన తదుపరి చిత్రం నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. 


అయితే ఈ సినిమాలో నితిన్ తో పాటు నారా రోహిత్, రానాలు కూడా నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఓ పక్క 'గరుడ వేగ' సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తూనే మరోపక్క ఈ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఈ సినిమాకు 'త్రీ కజిన్స్' అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఆరంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలున్నాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికార ప్రకటన వెలువడనుంది.

loader