Asianet News TeluguAsianet News Telugu

Prathyardhi Review : ‘ప్రత్యర్థి’ మూవీ రివ్యూ!

డెబ్యూ దర్శకుడు శంకర్ ముడావత్ దర్శకత్వంలో ఈ రోజు తెరకెక్కిన చిత్రం ‘ప్రత్యర్థి’ (Prathyardhi). క్రైమ్ థ్రిల్లర్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మెప్పించిందా? లేదా? అన్నది రివ్యూలో తెలుసుకుందాం. 
 

Prathyardhi Movie Review!
Author
First Published Jan 6, 2023, 5:05 PM IST

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈరోజు (జనవరి 6న) తెరకెక్కిన చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ డెబ్యూ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ప్రధాన పాత్రల్లో రవి వర్మ, సనా, రోహిత్ బెహల్, నీలిమా, తాగుబోతు రమేశ్, అక్షత సోనావానే తదితరులు నటించారు. గాలు పాలు డ్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మాతలు సంజయ్ సాహా, ఎం రాజునాయక్ నిర్మించారు. పాల్ పవన్, భీమ్స్ సిసిలియో సంగీతం అందించారు. డీవోపీ, ఎడిటర్, డీఐ వర్క్ ను రాకేష్ గౌడ్ చూశారు. షావోలిన్ మల్లేష్ ఫైట్ మాస్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతకీ సినిమా కథ ఏంటీ? ఎలా ఉందనే విషయాలను చూద్దాం.

కథ :

దరాబాద్ క్రైమ్ బ్రాంచ్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తుంటాడు కృష్ణ ప్రసాద్ (రవి వర్మ). ఎలాంటి కేసునైనా 24 గంటల్లోనే చేధించడం ఈయన ప్రత్యేకత.  ఒకరకంగా వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి మరీ విధి నిర్వాహణకు కట్టుబడి ఉండే పోలీస్ ఆఫీసర్ అని చెప్పొచ్చు. అందుకే కుటుంబంపై ధ్యాసలేదనే కోపంతో కూతురిని తీసుకొని భార్య (సనా) కూడా ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అంతా  ప్రొఫెషన్ లో దూసుకుపోతున్న ఆయనకు ఓ రోజు వైశాలి అనే యువతి తన భర్త విజయ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. ఈజీగా కేసు ఛేదించే కృష్ణ ప్రసాద్ కు కష్టతరంగా మారుతుంది. కేసు దర్యాప్తులో భాగంగా మెకానిక్ శివ (రవి బెహల్)తోపాటు మరో ఇద్దరు స్నేహితులు శశి, రాకేష్ లను అరెస్ట్ చేస్తారు. దర్యాప్తు కొనసాగుతుండగానే దేవ్ సింగ్ నాయక్ అనే జర్నలిస్ట్, కృష్ణ ప్రసాద్ కూతురు కూడా హత్యకు గురవుతారు. ఇంతకీ విజయ్ ఎలా మిస్ అయ్యాడు? అరెస్టైన వారికి హత్యలకు సంబంధం ఏమైనా ఉందా? ఇంతకీ విజయ్ కూతురు, జర్నలిస్ట్ లను హ్యత చేసిందెవరు? అనేది మిగితా సినిమా.

విశ్లేషణ :

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలపై ఆడియెన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఈ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమిది. మూవీలో ఎస్సై కేసు విచారణ తీరు ఆసక్తిగా ఉంటుంది.  పలు రకాలుగా ప్రసాద్ ఊహించడం కొత్తగా అనిపిస్తుంది. ఎస్సై తన భ్యారతో సాగే కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గానూ ఉంటాయి. రొమాంటిక్ సీన్స్ కూడా ఓ మేరకు బాగానే అనిపిస్తాయి. అనేక ట్విస్టులతో విజయ్ మిస్సింగ్ కేసు దర్యాప్తుకు ముడిపడి ఫస్ట్ ఆఫ్ సరదాగానే సాగిపోతోంది. ఇక సెకండాఫ్ లో విజయ్ మిస్సింగ్ కేసులో ముఖ్యమైన అంశాలను వెల్లడించే తీరు ఆసక్తిని పెంచుతాయి. ఫస్టాఫ్ లోని ప్రతి సీన్ కు సెకండాఫ్ లో మ్యాచ్ చేస్తూ దర్శకుడు క్లారిఫికేషన్ ఇవ్వడం ఆకట్టుకుంది. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు, ట్విస్టులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. పేరున్ నటీనటులతో, స్క్రీన్  ప్లే మరింత మెరుగ్గా సినిమా ఫలితం మరోలా ఉండేదనిపిస్తోంది. ప్రతి ట్విస్ట్ ను ఆసక్తిని కలిగించేలా తెరకెక్కించిన విధానం దర్శకుడి ప్రతిభను చూపుతుంది. మొత్తానికి మర్డర్ మిస్టరీ ప్రతి క్షణం ఉత్కంఠభరితంగానే సాగింది.

నటీనటులు : ఎస్సై పాత్రలో రవివర్మ జీవించాడు. ఆయా చిత్రాల్లో ఇప్పటికే చిన్న పాత్రలతో గుర్తింపు పొందిన రవి పోలీస్ ఆఫీసర్ గా డిఫరెంట్ బాడీ లాంగ్వేజీతో ఫుల్ రోల్ లో న్యాయం చేశాడు. శివ పాత్రలో రోహిత్ బెహల్ ఆకట్టుకున్నాడు. కానిస్టేబుల్ సత్యగా వంశీ ఆలూర్ చక్కటి పెర్పామెన్స్ తో అలరించారు. రేచల్, నిత్య, సన తమదైన నటనతో ఆకట్టుకున్నారు. 

టెక్నీకల్ టీమ్ : సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ పాల్ పవన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. మర్డర్ మిస్టరీ కావడంతో ఎడిటింగ్ విషయంలో, డీఐ విషయంలో రాకేశ్ గౌడ్ తన నైపుణ్యాన్ని కనబరిచారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. మిగితా టెక్నికల్ టీమ్ వర్క్ కూడా సినిమాకు తగ్గట్టుగా ఉంది. చిన్న బడ్జెట్ తో నిర్మించినప్పటికీ ఫీల్ గుడ్ సినిమాను అందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. 

Rating-2.75

Follow Us:
Download App:
  • android
  • ios