సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కూడా పబ్లిక్ చేసేస్తున్నారు. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం చేస్తోన్న పనులు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు బెడ్ రూమ్ ఫోటోలు, భార్యతో లిప్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇప్పుడు అలాంటి లిస్టు లోకి చేరిపోయాడు నటుడు ప్రతీక్ బబ్బర్. ఈ యంగ్ హీరో తన భార్యతో కలిసి అర్ధనగ్నంగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భార్య అర్ధనగ్నంగా నిలుచొని ఉండగా.. ఆమె ప్రైవేట్ పార్ట్ కవర్ చేస్తూ హీరో చేతిని అడ్డం పెట్టడం.. ఆ సమయంలో అతడి భార్య సెల్ఫీ తీయడం.. ఇదంతా చాలా బోల్డ్ గా ఉంది.

ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రతీక్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిసిటీ పిచ్చి మరింత ముదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా దిగాజారలా..? అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. 

బాలీవుడ్ లో 'భాఘి 2' సినిమాతో హిట్ అందుకున్న ప్రతీక్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే అతడు తన గర్ల్ ఫ్రెండ్ సాన్యా సాగర్ ని వివాహం చేసుకున్నాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

more like it!.. happy valentines! 💋

A post shared by prateik babbar (@_prat) on Feb 14, 2019 at 10:47am PST