యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేసిన సెకండ్ మూవీ కల్కి ఇటీవల రిలీజయ్యింది. రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కిన ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే నెక్స్ట్ ఈ దర్శకుడు ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 

ఇప్పటికే బాలకృష్ణతో చేయాలనీ ఉందని చెప్పగా రూమర్స్ డోస్ స్ట్రాంగ్ గా పెరుగుతోంది. ఇక అఖిల్ తో చేసే అవకాశం ఉన్నట్లు మరో రూమర్ హాట్ టాపిక్ అవుతుండగా వీటికి తోడు ఇటీవల ఇంటర్వ్యూలో నానితో కూడా డిస్కర్షన్స్ జరుగుతున్నట్లు చెప్పడం షాకిస్తోంది. 

నానితో ఒక స్క్రిప్ట్ విషయంపై డిస్కర్షన్స్ జరిగినట్లు చెప్పిన ప్రశాంత్ ఆడియెన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ నెలకొల్పాడు. కల్కి ఫైనల్ రిజల్ట్ అనంతరం ఎలాంటి సినిమా చేయాలనే దానిపై వివరణ ఇస్తానని చెబుతున్నప్పటికీ ఎవరితో వర్క్ చేస్తాను అనే విషయాన్నీ మాత్రం బయటపెట్టడం లేదు. బాలకృష్ణ - నాని - అఖిల్.. ఈ ముగ్గురిలో అ! దర్శకుడు ఎవరితో మొదట వర్క్ చేస్తాడో చూడాలి.