రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రాజశేఖర్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. గతంలో కల్కి చిత్రం కథని బాలకృష్ణ కోసం సిద్ధం చేశారనే ఊహాగానాలు వినిపించాయి. ఆ వార్తలపై ప్రశాంత్ వర్మ తాజగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 

ఈ కథని బాలకృష్ణ కోసం రూపొందించలేదు. ఈ చిత్రం కోసం బాలకృష్ణ గారిని హీరోగా కూడా ఎప్పుడూ అనుకోలేదు. కథ సిద్ధం చేయడం, రాజశేఖర్ గారు ఓకే చేయడం చక చకా జరిగిపోయాయని ప్రశాంత్ వర్మ తెలిపాడు. బాలయ్య కోసం తన వద్ద ఓ కథ ఉన్నట్లు కూడా ప్రశాంత్ వర్మ తెలిపాడు. 

గతంలో బాలకృష్ణ  కల్కి టైటిల్ తో సినిమా తీయాలని ప్రయత్నించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ప్రశాంత్ వర్మ అదే టైటిల్ తో కథ సిద్ధం చేయడంతో బాలయ్య కోసం అంటూ రూమర్లు మొదలయ్యాయి. 

మొత్తంగా అ!, కల్కి చిత్రాలతో తాను మంచి కాన్సెప్ట్ లతో సినిమా చేసే దర్శకుడినని ప్రశాంత్ వర్మ నిరూపించుకున్నాడు. ఈ యువ దర్శకుడు తదుపరి చిత్రం ఏ జోనర్ లో ఉండబోతోందో మరి!