ప్రభాస్ కెరీర్ లో 5వ సారి 300 కోట్ల మార్క్ ను 350 కోట్ల మార్క్ ను అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక ఈ చిత్రానికి దర్శకుడుగా ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పుడు ఎక్కడ చూసినా సలార్ గురించిన వార్తలే. ఓ రేంజిలో సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపి, భాక్సాపీస్ వద్ద దూసుకు పోతున్న ఈ చిత్రంకు హీరోతో సమానంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు పేరు వచ్చింది. అన్ని చోట్లా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా రెండు రోజుల్లోనే ట్రేడ్ లెక్కల్లో 250 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా మూడో రోజు కలెక్షన్స్ తో ఏకంగా 350 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ప్రభాస్ కెరీర్ లో 5వ సారి 300 కోట్ల మార్క్ ను 350 కోట్ల మార్క్ ను అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక ఈ చిత్రానికి దర్శకుడుగా ప్రశాంత్ నీల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు...లాభాల్లో వాటాతో కలిపి ప్రశాంత్ నీల్ కు ఈ సినిమా నిమిత్తం దాదాపు వంద కోట్లు దాకా ముట్టనుందని కన్నడ సినీ పరిశ్రమ అంటోంది. ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న తొలి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కావటం విశేషం. కేవలం నాలుగు సినిమాల్లోనే రెమ్యునరేషన్ పరంగా ఆ మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అవ్వటం గొప్ప విషయం. ఉగ్రం, ‘KGF, KGF2’, ఇప్పుడు #Salaar. అన్నీ సూపర్ హిట్స్. దాంతో ప్రశాంత్ నీల్ కు ఆ ఫ్యాన్స్ రేటు ని పే చేసారు. ప్రశాంత్ నీల్ కు కన్నడంలో కల్ట్ స్టేటస్ వచ్చింది. బెంగుళూరు, ఇతర సెంటర్లలో లైఫ్ సైజ్ కట్ అవుట్స్ పెట్టారు. కన్నడ పరిశ్రమకు రెస్పెక్ట్ తెచ్చిన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన బ్యాక్ అండ్ పోర్త్ స్క్రీన్ ప్లే, హీరో ఎలివేషన్స్, హీరోల్లో కోపం ఎలివేట్ చేయటం తెరపై అద్బుతంగా పండుతున్నాయి. అందుకే అంత ఇస్తున్నారు. 

మరో ప్రక్క ప్రభాస్ కు వంద కోట్లు ,లాభాల్లో వాటాగా రెమ్యునరేషన్ సెట్ చేసారని తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మళయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా కీలకమైన పాత్ర చేసారు. ఆయనకు ఎంత ఇచ్చి ఉంటారనేది హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం మేరకు..పృద్వీరాజ్ కు నాలుగు కోట్ల రూపాయలు వరదరాజ మన్నార్ పాత్ర చేయటానికి ఇచ్చారని సమాచారం. ప్రభాస్ తో సమానమైన కీలకమైన పాత్ర కావటంతో మారు మాట్లాడకుండా ఓకే చేసారని తెలుస్తోంది. అలాగే మళయాళ రైట్స్ లో కూడా మేజర్ షేర్ ఉందని వినికిడి. 

 #Salaar Ceasefire 1 చిత్రం బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్‌’ రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేసారు. శ్రుతిహాసన్‌ (salaar heroine) హీరోయిన్‌. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రతినాయకుడు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘సలార్‌’.. ‘కేజీయఫ్‌’ యూనివర్స్‌ కు సంబంధం ఉండదని సినిమా స్పష్టం చేసింది.

బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్. ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. అదే నిజమైంది.