ప్రశాంత్‌ నీల్‌ మదిలో మరో ఆలోచన ఉందట. ఓ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

`కేజీఎఫ్‌`(KGf) మూవీ ఇండియన్‌ సినిమాలో ఓ సంచలనం. `బాహుబలి` చిత్రానికి తమ్ముడి లాంటి సినిమా KGF2 అని చెప్పొచ్చు. `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) రికార్డులను కొల్లగొట్టి `బాహుబలి` టార్గెట్‌గా సాగిన సినిమా ఇది. ఇండియన్‌ సినిమాలో సరికొత్త సంచలనాలకు తెరలేపిన చిత్రమిది. సినిమా మేకింగ్‌లోనూ ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌. సినిమా అంటే ఇలానే తీయాలనే ధోరణిలకు బ్రేక్‌ చెబుతూ, కథని ఎలా అయినా చెప్పొచ్చనే కొత్త పంథాని పరిచయంచేసిన చిత్రమిది. అనేక రికార్డులకు నెలవుగా మారిన ఈ సినిమాని ఓ ఫ్రాంచైజీగా తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్టు నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ తెలిపిన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) రూపొందిస్తున్న `సలార్‌`కి, ఎన్టీఆర్‌తో చేయబోతున్నట్టు `NTR31`కి సంబంధం ఉందని తెలుస్తుంది. అదే సమయంలో `కేజీఎఫ్‌ 3` కూడా రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు. `కేజీఎఫ్‌ 2`లోనూ అదే విషయాన్ని హింట్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రశాంత్‌ నీల్‌ మదిలో మరో ఆలోచన ఉందట. ఓ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 

`కేజీఎఫ్‌` రెండు పార్ట్ ల్లో `కోలార్‌ గోల్డ్ ఫీల్డ్`లో ఓ అమ్మాయి జన్మించిన విషయం తెలిసిందే. ఆమె పాపని హీరో యష్‌(రాఖీభాయ్‌)కాపాడతాడు. ఆ పాపకి తన తల్లి పేరు కూడా పెడతారు రాఖీభాయ్‌. అయితే రెండో పార్ట్ లో రాఖీభాయ్‌ చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ధైర్యాన్ని, డేర్‌నెస్‌ని పునికి పుచ్చుకుని ఆ అమ్మాయి వీర వనితలా ఎదగబోతుందని, ఆమె ఓ యోధురాలిగా మారి కేజీఎఫ్‌లో తను నాయకురాలిగా ఎదిగి ప్రత్యర్థులపై పోరాడటం అనే కథాంశంతో ఈ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీని కథని కూడా డెవలప్‌ చేశారని తెలుస్తుంది.

మరి ఈసినిమా ఎప్పుడుంటుందనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ప్రశాంత్‌ నీల్‌ మాత్రం ఈ స్టోరీతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరం. ఇక ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ `సలార్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైనింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో మైనింగ్‌ కార్మికులకు నాయకుడిగా ప్రభాస్‌ కనిపిస్తారని తెలుస్తుంది. శృతి హాసన్‌ ఇందులో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఈ ఏడాది చివరల్లో ఎన్టీఆర్‌ సినిమాని పట్టాలెక్కించనున్నారని సమాచారం.