ప్రశాంత్ నీల్ తో తమ ఆలోచన చెప్పటం..ఆయన అందుకు తగ్గ మూడు కాన్సెప్టులు చెప్పటం జరిగిందిట. అందులో ఒకటి పిక్ చేసి చరణ్, చిరంజీవి ఓకే చేసి ...

‘కెజీఎఫ్‌’ సిరీస్‌ సినిమాలతో కన్నడ సినిమా సత్తా ఏంటో చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు ప్రశాంత్‌ . ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో ‘సలార్‌’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే ఇప్పుడాయన మరో ప్రాజెక్ట్‌ కూడా పట్టాలెక్కించినట్లు తెలిసింది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్టు ఓ మల్టిస్టారర్ అని వినికిడి. అయితే ఇందుకు ఓ స్పెషలిటీ ఉంది. అదేమిటంటే..

చిరంజీవికు తన కుమారుడు రామ్ చరణ్ తో కలిసి ఫుల్ లెంగ్త రోల్ చేస్తూ ఓ సూపర్ హిట్ చిత్రంలో కనిపించాలనేది కోరిక. అయితే అది ఆచార్యతో తీరుతుందనుకున్నారు. అయితే అనుకోని విధంగా అది డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో తన ఆలోచన చెప్పటం..ఆయన అందుకు తగ్గ మూడు కాన్సెప్టులు చెప్పటం జరిగిందిట. అందులో ఒకటి పిక్ చేసి చరణ్, చిరంజీవి ఓకే చేసి డవలప్ చేయమన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా మల్టీస్టారర్ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోకి సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందట. ఆ పాత్ర సెకండాఫ్ లో వస్తుందని, కీ టైమ్ లో ట్విస్ట్ ఇస్తుందని అంటున్నారు. 

ఇక ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఏది ఏమైనా ప్రశాంత్ నీల్ –చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో సినిమా వస్తోంది అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. చిరు, చరణ్ ల మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది. 

 పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వం లో గేమ్ చేంజర్ చిత్రం లో నటిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత వరుస చిత్రాలకు కమిట్ అయ్యారు. అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక చిత్రం ఉండనుంది. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదిక గా బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రశాంత్ నీల్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. గ్రేట్ బర్త్ డే, గ్రేట్ ఇయర్ అంటూ చెప్పుకొచ్చారు. 

మరో ప్రక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తన ఫోకస్ మొత్తం కూడా సలార్ చిత్రం పై పెట్టారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ లో వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.