కేజీఎఫ్ చిత్రంతో త‌నేంటో నిరూపించుకున్న డైరక్టర్ ప్ర‌శాంత్ నీల్. ఆ సినిమా త‌ర్వాత ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌లు త‌మ బ్యాన‌ర్ లో సినిమా చేయాల‌ని ఆఫ‌ర్స్ ఇచ్చినా ఏదీ ఎగ్రిమెంట్ చేయలేదు. ప్ర‌స్తుతం కేజీఎఫ్ చాప్ట‌ర్ 2తో ప్రేక్ష‌కుల ముందుకు రావటానికి సన్నాహాలలో బిజీగా ఉన్నాడు. మరో ప్రక్క ఇదే సమయంలో  కొద్ది రోజులుగా కేజీఎఫ్ ద‌ర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, రీసెంట్ గా ఈ ప్రాజెక్టు ని ఖరారు చేస్తూ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం మిన్నుమింటింది. వాళ్లంతా ఇప్పుడు ఏ సబ్జెక్టు తో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కబోతోందా అని చర్చించుకుంటున్నారు.

కన్నడ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..  ఆ మధ్యన హైదారాబాద్ లో ఎన్టీఆర్ ను క‌లిసిన ప్రశాంత్ నీల్ తాము చేయబోయే సినిమా స్టోరీ లైన్, ఎలా సాగుతుందో వివ‌రించ‌గా… ఎన్టీఆర్ వెంట‌నే ఓకే చెప్పేశాడ‌ని తెలుస్తోంది. ఆ కథ  కూడా కేజీఎఫ్ తరహాలోనే పిరియాడిక్ క‌థాంశంతో సాగుతుందని చెప్తున్నారు. అలాగే ఈ సినిమాని బెంగుళూరుని ఒకప్పుడు ఏలిన ఓ లోకల్ డాన్ కథతో తెరకెక్కిస్తారని అంటున్నారు. ఈ మేరకు కొంత రీసెర్చ్ వర్క్ చేసి స్క్రిప్టు రెడీ చేసారని, ఓ రేంజిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని, కేజీఎఫ్ కు నాలుగు రెట్లు ఉంటుందని అంటున్నారు. అయితే ఆ నిజ జీవిత కథకు,కొంత ఫిక్షన్ ని యాడ్  చేసుకుని తెరకెక్కించబోతున్నారట. అయితే ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

 ఈ చిత్రాన్ని పాన్-ఇండియా మూవీగా తీసుక‌రావాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాల‌ని ఎన్టీఆర్ కోర‌గా… కేజీఎఫ్-2 పూర్తి కాగానే ఈ సినిమాపై ఫోక‌స్ పెట్ట‌బోతున్నాన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుండ‌గా… ప్ర‌శాంత్ నీల్ ఇప్ప‌టికే అడ్వాన్స్ కూడా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.