'విక్కీ డోనర్' చిత్రంతో బాలీవుడ్‌లో సత్తా చాటిన ఆయుష్మాన్‌ ఖురానా.. ఆ తర్వాత 'అంధాదున్' వంటి మరో వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. 'బద్లాపూర్' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించగా.. సీనియర్‌ నటి టబు ఓ కీలక పాత్రలో కనిపించింది.   

అంధాదున్ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవడమే కాకుండా మూడు విభాగాల్లో నేషనల్ అవార్డులను గెలుచుకుంది. దీంతో సినిమా రీమేక్ రైట్స్ పై ఒక్కసారిగా పోటీ పెరిగిపోయింది. తీవ్రమైన పోటీ నడుమ ఇటీవల తమిళ్ రైట్స్ ను సీనియర్ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత అయిన త్యాగరాజన్ శివనందం దక్కించుకున్నారు.ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అందుకు తన కుమారుడు జీన్స్ చిత్రం హీరో ప్రశాంత్ ని హీరోగా తీసుకున్నారు. దాంతో అనేక మంది కామెంట్స్ చేసారు. ప్రశాంత్ ఏమిటి మళ్లీ హీరోగా చేయటం ఏమిటి...అంత లావు ఉన్నాడు. వయస్సు కూడా పెద్దదే అంటూ కామెంట్స్ వినిపించాయి. . ఈ ఏడాది సంక్రాంతి కి రిలీజైన వినయ విధేయ రామ సినిమాలో ప్రశాంత్ ముఖ్య పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. 

అయితే తమిళ్ అంధాదున్ లో బ్లైండ్ హీరో పాత్రలో కనిపించబోయేది సీనియర్ హీరో అయిన తన తనయుడు ప్రశాంత్ అని త్యాగరాజన్ క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రశాంత్ సినిమాలో పాత్రకు తగ్గట్టు మారడానికి చాలా కష్టపడుతున్నట్లు ఆయన చెప్పారు. మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన ప్రశాంత్ ఇప్పుడు అంధాదున్ సినిమా కోసం 20 కేజీల బరువు తగ్గినట్లు త్యాగరాజన్ చెప్పారు.  

ఇక ఈ చిత్రంలో హీరో అంధుడైన ఓ పియానో ప్లేయ . అంధుడైనప్పటికీ మిగతా జ్ఞానేంద్రియాల సహకారంతో తన జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటాడు. తనకొక ప్రేయసి కూడా ఉంటుంది. అయితే అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో ఓ మహిళ పరిచయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఓ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? హత్య చేసిన వ్యక్తిని హీరో ఎలా గుర్తించి చట్టానికి పట్టిస్తాడు.. అనే నేపథ్యంతో చిత్రం రూపొందింది. ఈ సినిమా పూర్తి మర్డర్‌ మిస్టరీగా తెరకెక్కినప్పటికీ ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ గా సాగిపోతుంది.