Asianet News TeluguAsianet News Telugu

Krishna Mukunda Murari : అయోమయ పరిస్థితిలో భవాని.. కృష్ణ కి హ్యాండ్ ఇచ్చిన గౌతమ్!

Krishna Mukunda Murari : స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాన్ని దోచుకుంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగుతుంది ఈ కథ. ఇక ఈరోజు మార్చి 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Pramila tells Murari about Krishna's unnatural behaviour in todays Krishna Mukunda Murari serial gnr
Author
First Published Mar 21, 2023, 2:12 PM IST

 ఎపిసోడ్ ప్రారంభంలో అత్తగారి అభిమానాన్ని తట్టుకోలేక ఆమెని  కన్నీటితో హత్తుకుంటుంది కృష్ణ. ఆమెకి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపిస్తుంది రేవతి. మరోవైపు  జరిగిందాని గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది భవాని. నేను కూతుర్ని కాపాడుకోవాలా పరువు ప్రతిష్టల్ని కాపాడుకోవాలా, కూతుర్ని రక్షిస్తున్నందుకు కృష్ణని క్షమించాలా, నందిని కి గతం గుర్తొస్తే ఏం చేయాలి అంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది భవాని.

మరోవైపు తల్లిని పిలిచి కృష్ణ ఏది అని అడుగుతాడు మురారి. తను ఇందాకే వెళ్ళింది నీకు చెప్పలేదా అంటుంది రేవతి. నేను పడుకున్నాను మమ్మీ అయినా ఇంత ఎర్లీగా ఎందుకు వెళ్లిపోయింది అంటాడు మురారి. సీనియర్ డాక్టర్ని కలవాలని వెళ్ళింది అంటుంది రేవతి. బయటికి వెళ్ళబోతుంటే టిఫిన్ తినేసి వెళ్ళు అంటుంది రేవతి. టైం లేదుఅని మురారి అంటే అన్ని పనులకి టైం ఉంటుంది కానీ టిఫిన్ తినడానికి మాత్రం టైం ఉండదు అని కొడుకుని మందలిస్తుంది రేవతి.

 నేను బయటి తింటాను మమ్మీ నువ్వు కంగారు పడకు అంటూ వెళ్ళిపోతాడు మురారి. ఇదంతా గమనిస్తున్న ముకుంద, మురారి కంటే ముందు వెళ్లి అతని కార్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆశ్చర్యపోయిన మురారి ఏమైంది అంటాడు. రేపటి నుంచి నేను నీకు ఇలాగే డోర్ తీసి పట్టుకుంటాను అలాగే వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉంటాను అంటుంది ముకుంద. ఎందుకు అని మురారి అంటే మన ప్రేమ లోకానికి పూల దారి దగ్గరకు వచ్చేసింది అంటుంది ముకుంద.

అర్థం కానట్లు చూస్తాడు మురారి. అనుకున్న దానికంటే ముందుగానే కృష్ణ వెళ్ళిపోతుంది కదా నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది ముకుంద. నా కాపురం కూలిపోతున్నందుకా అంటాడు మురారి. నేను కావాలనుకుని చేయలేదు, మన ప్రేమ కోసమే దేవుడు ఇలా చేస్తున్నాడు అంటుంది ముకుంద. నీతో దేవుడు గురించి చర్చించే అంత సమయం నాకు లేదు అంటాడు మురారి.

నీకు సంతోషంగా లేదా కావాలంటే కృష్ణ కి ఫేర్వెల్  పార్టీ ఇచ్చి దగ్గరుండి బస్సు ఎక్కించి పంపిద్దాము. తర్వాత మన ప్రేమకి వెల్కం పార్టీ అంటూ ఆనందంగా మాట్లాడుతుంది ముకుంద. నీకు ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నట్టున్నాయి అంటాడు మురారి. తను వెళ్ళిపోతే మన ఫ్యూచర్ ని మనమే అందంగా డిజైన్ చేసుకోవచ్చు ఇక జీవితాంతం ప్రేమమయం అంటుంది ముకుంద.

కృష్ణ వెళ్లిపోయిన తర్వాత నేను, ఆదర్శ్ కనబడక నువ్వు ఇద్దరం కలిసి తిరిగితే లోకం నీకు ఏం పేరు పడుతుందో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ వెళ్ళిపోతాడు మురారి. ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అయిపోతుంది ముకుంద. మరోవైపు గౌతమ్ రూమ్ లోకి వచ్చిన కృష్ణ అక్కడ గౌతమ్ లేకపోవడంతో టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.

గౌతమ్ టేబుల్ మీద ఉన్న నందిని ఫోటోని చూసే టైం కి కరెక్ట్ గా మురారి వచ్చి ఆమె మీద చేయి వేస్తాడు ఒక్కసారిగా తుళ్ళిపడిన కృష్ణ ఆ ఫోటోని చూడకుండానే కింద పెట్టేస్తుంది మీరేంటి ఇక్కడ అని మురారిని అడుగుతుంది. ఎందుకు టెన్షన్ గా ఉన్నావు అని మురారి అంటే బానే ఉన్నాను మీరు వచ్చేటప్పటికి నందిని ఎలా ఉంది అని అడుగుతుంది. తను బానే ఉంది కానీ ఎవరికీ చెప్పకుండా నువ్వు ఇక్కడికి వచ్చి చేసే పని ఇదే ఎవరికి ట్రీట్మెంట్ చేస్తున్నావు.

 ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. గౌతమ్ సర్ ని కలవడం ఇంపార్టెంట్ అంటుంది కృష్ణ. ఏ సి పి సార్ అని పిలిచే దానివి ఇప్పుడు మాటే  మరిచిపోయి మాటకు ముందు ఒక గౌతమ్ సార్ మాటకి వెనుక ఒక గౌతమ్ సర్ ఏంటిది అంటూ చిన్న గుచ్చుకుంటాడు మురారి. ఇప్పుడేమంటారు అంటూ మురారి మీద కేకలు వేస్తుంది కృష్ణ.

బయటికి వెళ్లి కాఫీ తాగుదాం రా అని మురారి పిలిస్తే గౌతమ్  సార్ వచ్చేదాకా నేను ఎక్కడికీ రాను అంటుంది కృష్ణ. సరే నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురారి. మరోవైపు మురారి అన్న మాటలు తలుచుకొని  బాధపడుతుంది ముకుంద. నన్నే అంట మాట అంటావా చూస్తూ ఉండు నువ్వు నన్ను ఎంత దూరం పెట్టినా నా ప్రేమతో నిన్ను గెలుచుకుంటాను అనుకుంటుంది ముకుంద. మన ప్రేమ శాశ్వతం నీ పెళ్లి తాత్కాలికం అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.

 మరోవైపు పరిమళని కలిసిన కృష్ణ, గౌతమ్ సర్ రాలేదు మీకు ఏమైనా చెప్పారా ఎన్ని గంటలకి వస్తారో ఒకసారి కనుక్కొని చెప్తారా  అంటూ పరిమళని అడుగుతుంది. నువ్వు గౌతమ్ కోసం వచ్చావా డ్యూటీ కోసం వచ్చావా అని అడుగుతుంది పరిమళ. ఇప్పుడు గౌతమ్ సర్  కోసమే వచ్చాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు నాకు పిచ్చెక్కిపోతుంది అంటుంది కృష్ణ అతను ఫోన్ చేయకపోతే నీకు ఎందుకు పిచ్చి ఎక్కటం అని అడుగుతుంది పరిమళ.

నిజంగానే పరిస్థితి అలానే ఉంది మేడం మీకు తెలిస్తే నిజం చెప్పండి అంటుంది కృష్ణ. అతను లాంగ్ లీవ్ పెట్టాడు రాడు అంటుంది పరిమళ. ఒక్కసారిగా షాక్ అయినా కృష్ణ లాంగ్ లీవ్ పెట్టారా అంటూ గట్టిగా అరుస్తుంది. మెంటలా నీకు ఏమైనా అతను రిజైన్ చేస్తే నీకు ఏంటి లీవ్ పెడితే నీకు ఏంటి అంటూ కృష్ణని మందలిస్తుంది పరిమళ. పరిమళని బ్రతిమాలి  గౌతమ్ కి కాల్ చేయిస్తుంది కృష్ణ.

అతను లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ పెట్టేసిన పరిమళ ఆ అడ్రస్ లేని మనిషితో నీకేంటి పని అయినా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. సమాధానం ఏమీ చెప్పకుండానే అక్కడినుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. మరోవైపు పరిమళ మురారికి ఫోన్ చేసి  ఏం ఏసిపివి నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఎలా పని చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం జరిగింది ఉంటాడు మురారి.

కృష్ణ పిచ్చి పట్టిన దానిలాగా ఉంది, ఆ తాగుబోతు కోసం నీ భార్య ఎందుకు అలాగా ఎంక్వయిరీ చేస్తుంది తన ప్రవర్తన నాకు అంతుపట్టడం లేదు అంటుంది పరిమళ. నా భార్య ని అనుమానిస్తున్నావా అంటాడు మురారి నీకు అనుమానం లేదా అని పరిమళ అంటే లేదు బాధ మాత్రమే ఉంది నా భార్య నాతో టైం స్పెండ్ చేయకుండా అతని పేరు కలవరిస్తుంది అని కోపం మాత్రమే ఉంది అంటాడు మురారి.రెండు రోజులు పోతే నీకే అది కోపం కాదు అనుమానం కానీ అర్థమవుతుంది లే.

కోపం అనుమానంగా మారకముందే నీ సంసారాన్ని చక్కదిద్దుకో అంటూ సలహా ఇస్తుంది పరిమళ. తరువాయి బాగుంలో నందిని విషయంలో ఇప్పటికీ నేను తప్పు చేయలేదని అనుకుంటున్నాను కానీ దురదృష్టం కొద్ది రుజువు చేసుకోలేకపోతున్నాను అంటుంది కృష్ణ. దానికి ఇంట్లోంచి వెళ్ళిపో అక్కర్లేదు అక్కని క్షమాపణ అడుగు అంటుంది రేవతి. అది తప్పు చేసిన వాళ్ళు మాత్రమే చేస్తారు నేను ఎప్పటికీ అలా చేయను కచ్చితంగా వెళ్ళిపోతాను అంటుంది కృష్ణ.

Follow Us:
Download App:
  • android
  • ios