మహానటి చిత్రంలో ప్రకాష్ రాజ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహానటి మహానటి చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్

ప్రముఖ తెలుగు నటి సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహానటి' సినిమాలో తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేరారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్.... మహానటి సావిత్రిగా లీడ్ రోల్ చేస్తోంది. ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలిపింది.

తెలుగు సినీపరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరు, విజయ వాహిని బేనర్ అధినేత చక్రపాణి పాత్రలో ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. తొలినాళ్లలో సావిత్రిలోని టాలెంట్ గుర్తించి, తన సినిమాల్లో నటిగా అవకాశం ఇచ్చిన నిర్మాతల్లో చక్రపాణి ఒకరు. సావిత్రి సినీ జీవితంలోని అతిముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆ పాత్ర సినిమాలో కీలకంగా ఉండనున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారు.

ఈ చిత్రంలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బేనర్లో 'మహానటి' చిత్రం తెరకెక్కుతోంది.