Asianet News TeluguAsianet News Telugu

MAA Election: మనస్సాక్షిగా ఓటేద్దాం... ‘‘మా’’ హితమే మా అభిమతం: ప్రకాశ్ రాజ్ సంచలన ట్వీట్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా కలకలం రేపారు. మనస్సాక్షిగా ఓటేద్దాంమంటూ ట్వీట్ చేశారు. యువర్ ఓట్ ఈజ్ యువర్ వాయిస్ అని తెలిపారు. ‘‘మా’’ హితమే మా అభిమతమని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. 

prakash raj tweet goes viral over maa elections
Author
Hyderabad, First Published Sep 29, 2021, 7:47 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వాడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10కి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బరిలో నిలిచిన వారు ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. తొలుత సైలెంట్‌గా వున్న మంచు విష్ణు.. గత కొన్ని రోజుల నుంచి దూకుడు పెంచారు. అటు ప్రకాశ్ రాజ్ సైతం తనకు మద్ధతు ఇవ్వాల్సిందిగా పెద్దలను కోరుతున్నారు. తాజాగా ఈరోజు మా అధ్యక్షుడు నరేశ్ మీడియా ముందుకు రావడంతో మళ్లీ ఫిలింనగర్ ‌లో వేడి రాజుకుంది.

ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా కలకలం రేపారు. మనస్సాక్షిగా ఓటేద్దాంమంటూ ట్వీట్ చేశారు. యువర్ ఓట్ ఈజ్ యువర్ వాయిస్ అని తెలిపారు. ‘‘మా’’ హితమే మా అభిమతమని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. 

అంతకుముందు ప్రస్తుత ‘‘ మా ’’ అధ్యక్షుడు నరేశ్ మీడియాతో మాట్లాడుతూ.. మంచు విష్ణుకు తాను సంపూర్ణ మద్ధతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మా పనితీరు మెరుగుపరడచానికి తాము కృషి చేశామన్నారు. వెల్ఫేర్ కమిటీని విజయవంతంగా నిర్వహించామని.. ఇంతకన్నా ఎవరైనా వెల్ఫేర్‌లో చేయగలరా అని నరేశ్ ప్రశ్నించారు. ‘‘మా’’ ఎప్పుడు మసకబారలేదని.. మా లో ఓ గ్రూపు అబద్ధపు ప్రచారం చేసిందని నరేశ్ ఆరోపించారు. రెండేళ్ల పాటు డైరీ కూడా విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టారని ఆయన మండిపడ్డారు. కరోనా సమయంలో రూ.కోటి ఫండింగ్ సమకూర్చామన్నారు.

మంచి వారసుడిని మాకు అందిస్తామన్న నరేశ్.. అందుకే మంచు విష్ణుకి మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. ఎవరు పడితే వారు మా సీటులో కూర్చుంటే పదవి మసకబారుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సేవా రాజకీయం, శవ రాజకీయం రెండున్నాయని.. నాకు సేవ రాజకీయం మాత్రమే తెలుసునని నరేశ్ తెలిపారు. తాను మాలో శవ రాజకీయం కూడా చూశానని.. భవనం కట్టాలని అందరూ డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. భవనం కంటే కరోనా సమయంలో ఆర్టిస్టుల ప్రాణాలే ముఖ్యమని నరేశ్ పేర్కొన్నారు.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios