హీరో సిద్ధార్థ్ కు చేధు అనుభవం.. సారీ చెప్పిన ప్రకాష్ రాజ్.. విషయం ఏంటీ?

సినిమా ప్రమోషన్స్  కోసం బెంగళూరుకు వెళ్లిన హీరో సిద్ధార్థ్ కు చేధు అనుభవం కలిగింది. అక్కడి నిరసన కారులు ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. 
 

Prakash Raj Say sorry to Siddharth for his press conference in Bengaluru being disrupted NSK

హీరో సిద్దార్థ్ (Siddharth)  బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. చివరిగా ‘టక్కర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ‘చిత్తా’ అనే తమిళ సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సిద్దార్థ్ బెంగళూరులో ఈ సినమా ప్రమోషన్స్ కోసం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఎస్ఆర్వీ థియేటర్ లో నిర్వహించిన సమేశానికి బెంగళూరులోని నిరసన కారుల నుంచి అంతరాయం కలిగింది. 

‘మేమంతా కావేరి నీరు తమిళనాడు వెళ్తున్న సమస్యపై పోరాటం చేస్తుండగా.. తమిళ చిత్రాన్ని ఇక్కడ ఎలా ప్రమోట్ చేస్తారు’ అంటూ కొందరు నిరసన కారులు సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో సిద్ధార్థ్ సింపుల్ గా మీడియాకు థ్యాంక్యూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)   స్పందించారు. ట్వీటర్ వేదికన సిద్ధార్థ్ కు సారీ కూడా చెప్పారు. 

ప్రకాష్ రాజ్ ట్వీట్ లో.. ’దశాబ్దాల నాటి ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైన అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించే బదులు.. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఒత్తిడి చేయని పనికిమాలిన పార్లమెంటేరియన్లను ప్రశ్నించే బదులు.. సామాన్యులను, కళాకారులను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కన్నడిగుడిగా .. కన్నడిగుల తరపున క్షమించండి సిద్ధార్థ్’ అంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. 

అయితే, తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ పలు కన్నడ సంస్థలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలోని మాండ్య ప్రాంతంలో, బెంగళూరు నగరానికి తాగునీరు, వ్యవసాయ భూములకు సాగునీరుకు కావేరినే ప్రధాన జలవనరు. దీంతో తమకు నీటి సమస్య రాకూడదని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కు అంతరాయం కలిగింది. ఇలా గతంలోనూ పలు ఈవెంట్లు రద్దు అయ్యాయి. బెంగుళూరు ఇటీవలి కాలంలో ఇలా ఘటనలు చాలానే జరిగాయి.  కునాల్ కమ్రా, మునావర్ ఫరూఖీ, వీర్ దాస్ వంటి హాస్యనటుల ఈవెంట్లు కూడా పలు నిరసనల కారణంగా రద్దు చేశారు.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios