Asianet News TeluguAsianet News Telugu

పార్టీ స్థాపించి మళ్ళీ ఎలక్షన్స్ కి సిద్దమవుతున్న ప్రకాష్ రాజ్

 

సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగానే రాజకీయాల్లో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. పార్టీ స్థాపించి మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని తెలిపారు. 

prakash raj new political decision
Author
Hyderabad, First Published May 30, 2019, 1:03 PM IST

సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగానే రాజకీయాల్లో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. పార్టీ స్థాపించి మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని తెలిపారు. ఇటీవల బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ప్రకాష్ రాజ్ భారీ ఓటమిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

కేవలం 2.4% ఓట్లను అందుకొని మూడవస్థానంలో నిలిచారు. ఆ స్థానంలో బీజేపీ నాయకుడు పిసి.మోహన్ 50.4% ఓట్లను అందుకొని భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే పార్టీని స్థాపించి ఇక నుంచి ప్రజల్లోకి వెళతామని ఇటీవల ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు. 

రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మరో క్లారిటీ ఇచ్చారు. త్వరలో పార్టీ పేరును తెలియజేస్తానని అలాగే రానున్న బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా పోటీలో పార్టీని నిలబెడతానని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios