నిన్ననే(సోమవారం) తన చేతి గాయానికి సంబంధించిన సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మంగళవారం ఉదయం జిమ్‌కి వెళ్లారు. అక్కడ మెగాస్టార్‌ని కలిశారు ప్రకాష్‌ రాజ్‌.

వరుస ట్వీట్లతో `మా` ఎన్నికలకు సంబంధించి దుమారం సృష్టిస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ ఇప్పుడు మరో ఆసక్తకిర పరిణామాలకు తెరలేపారు. ఆయన తాజాగా చిరంజీవిని కలిశారు. నిన్ననే(సోమవారం) తన చేతి గాయానికి సంబంధించిన సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మంగళవారం ఉదయం జిమ్‌కి వెళ్లారు. అక్కడ మెగాస్టార్‌ని కలిశారు ప్రకాష్‌ రాజ్‌. ఈ విషయాన్ని ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 

`బాస్‌ని జిమ్‌లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడూ మాకు స్ఫూర్తిదాయకం అన్నయ్య` అంటూ ట్వీట్‌ చేశారు ప్రకాష్‌ రాజ్‌. దీంతో ఇప్పుడిది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ప్రకాజ్‌ రాజ్‌ `మా` ఎన్నికల బరిలో ఉన్నారు. అధ్యక్షుడి కోసం ఆయన పోటీపడుతున్నారు. ఇప్పటికే ఆయన తన ప్యానెల్‌ని ప్రకటించి ప్రెస్‌మీట్‌ కూడా పెట్టారు. ఎన్నికల వరకు తాను `మా` ఎలక్షన్ల గురించి మాట్లాడనని తెలిపారు. 

Scroll to load tweet…

అయితే ఇండైరెక్ట్ గా ట్వీట్ల రూపంలో హీటు పెంచుతున్నారు. `ఎన్నికలెప్పుడు`, `జెండా ఎగరేస్తాం`.. అంటూ ఆయన పెట్టిన ట్వీట్లు ఫిల్మ్ నగర్‌లో దుమారం రేపుతున్నాయి. ఇటీవల నటి హేమ చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి ఫైర్‌ అయ్యారు. `మా` ప్రతిష్ట దిగజార్చే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణ సంఘం చైర్మెన్ కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవిని ప్రకాష్‌ రాజ్‌ కలవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అనేక కొత్త పరిణామాలకు తెరలేపినట్టువుతుంది. `మా` ఎన్నికల వేడి మరింత రక్తికట్టేలా తయారైందని సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిల ఉంటే ఈ నెల 22 `మా` సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశాలున్నాయి.