భీమ్లా నాయక్ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులు అనుకూలంగా లేవు. భీమ్లా నాయక్ చిత్రం విడుదల ముందు రోజు నుంచే అధికారులు జీవో 35ని కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన భీమ్లా నాయక్ చిత్రం శుక్రవారం థియేటర్స్ లో విడుదలైంది. దీనితో పవన్ అభిమానుల సంబరాలతో తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపించింది. యూఎస్, బ్రిటన్ దేశాల్లో కూడా పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ చిత్ర రిలీజ్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. భీమ్లా నాయక్ మూవీ రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది.

ఇదిలా ఉండగా భీమ్లా నాయక్ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులు అనుకూలంగా లేవు. భీమ్లా నాయక్ చిత్రం విడుదల ముందు రోజు నుంచే అధికారులు జీవో 35ని కఠినంగా అమలు చేయడం ప్రారంభించారు. దీనితో ఏపీలో భీమ్లా నాయక్ టికెట్స్ ని థియేటర్ యజమాన్యాలు గిట్టుబాటు కాని అతి తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కృష్ణా జిల్లాలో అయితే చాలా సెంటర్స్ లో థియేటర్స్ ని యాజమాన్యాలు మూసివేశాయి. దీనితో భీమ్లా నాయక్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. టికెట్ ధరలు అనుకూలంగా ఉన్న తెలంగాణ వసూళ్లకు.. ఆంక్షలు విధించిన ఏపీ వసూళ్లకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. 

దీనితో పవన్ అభిమానులు ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోంది అని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క్రేజీ నటుడు ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

ప్రకాష్ రాజ్ ట్విటర్ లో ' ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భీమ్లా నాయక్ చిత్రంపై దాడి ఆపాలి. సినిమాని ఎదగనివ్వండి. సృజన, సాంకేతికత మేళవించిన చిత్ర పరిశ్రమపై అధికార దుర్వినియోగం, అధిపత్యధోరణి ఏమిటి ? చిత్ర పరిశ్రమని క్షోభపెడుతూ మేము ప్రోత్సహిస్తున్నాము అంటే నమ్మాలా ? ఏదైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. బాక్సాఫీస్ వద్ద కక్ష సాధింపులు ఎందుకు ? ఎంత ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు' అంటూ ప్రకాష్ రాజ్ ప్రభుత్వానికి చురకలంటించారు. 

ప్రకాష్ రాజ్ గత ఏడాది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటించారు. లాయర్లుగా వీరిద్దరి వాదన వెండితెరపై ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ 'నందాజీ' అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. 

Scroll to load tweet…