Asianet News TeluguAsianet News Telugu

ప్రకాష్ రాజ్ ప్రవర్తనతో హర్ట్ అయిన కొరటాల శివ

  • ప్రకాష్ రాజ్ ప్రవర్తనతో కొరటాల శివ మనస్తాపం
  • షూటింగ్ లో ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని సమాచారం
  • ప్రకాష్ రాజ్ ప్రవర్తనతో షూటింగ్ లో ఇబ్బంది పడుతున్న కొరటాల?
prakash raj giving trouble while bharath anu nenu shooting to koratala shiva

తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించిన నటుడు ప్రకాష్ రాజ్. తెలుగులో బడా హీరోల సినిమాలకు కూడా కాల్షీట్స్ ఇవ్వలేనంత బిజీగా మారి నిర్మాతలని దర్శకులని తనచుట్టూ తిప్పుకున్నాడు. అసలు ప్రకాష్ రాజ్ లేనిదే సినిమాలేదన్న రేంజ్ లో విలన్ అయినా..  హీరోకి సపోర్ట్ క్యారెక్టర్ అయినా హీరోకో హీరోయిన్ కో తండ్రిపాత్ర అయినా ఇలా ఎపాత్రలో అయినా వొదిగిపోగల టాలెంట్ ప్రకాష్ రాజ్ సొంతం.

 

అందువల్లనే ప్రకాష్ రాజ్ కాల్షీట్ల కోసం దర్శకులు క్యూ కట్టే పరిస్థితి ఉండేది. అసలు ప్రకాశ్ రాజ్ లేకుండా ఎలా? అన్నట్టుగా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండేది. అటువంటి ప్రకాష్ రాజ్ ను దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం తాను మహేష్ తో తీస్తున్న ‘భరత్ అను నేను’ సినిమా నుండి తీసివేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిలిం నగర్ లో గాసిప్పుల హడావిడి కనిపిస్తోంది. 

 

రోజుకి పది లక్షలు చొప్పున రెమ్యునరేషన్ తీసుకునే ప్రకాష్ రాజ్ షూటింగ్ కి లేట్ గా వచ్చినా షూటింగ్ మధ్యలో చెప్పాపెట్టకుండా మాయం అయిపోతాడనేపేరుంది. ఇంత నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉన్నా కొరటాల శివ తన లేటెస్ట్ మూవీలో ప్రకాష్ రాజ్ కు ఒక మంచి పాత్ర ఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణం ప్రారంభం అయిన ఈమూవీ షూటింగ్ కు ప్రకాష్ రాజ్ తన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు చూపించకుండా ఈ సినిమా యూనిట్ ని తెగ ఇబ్బంది పెడుతున్నాడట. దీనివల్ల కొన్ని సార్లు ఒక్క షాట్ కూడా తీయకుండానే ప్యాకప్ చెప్పేస్తున్నాడట కొరటాల. 

 

ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలి అన్న పట్టుదలతో ఉన్న కొరటాలకు ప్రకాష్ రాజ్ ప్రవర్తన అడ్డుగా మారడంతో అతని స్థానంలో రావ్ రమేశ్ ను కాని రాజేంద్రప్రసాద్ ను కాని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట కొరటాల. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పటికే పూర్తిగా అవకాశాలు తగ్గిపోయిన ప్రకాష్ రాజ్ ఇక మారడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..   

Follow Us:
Download App:
  • android
  • ios