బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి మద్దతు తెలిపారు. కంగనా హీరోయిన్ గా ప్రకాష్ 'మెంటల్ హై క్యా' సినిమాను రూపొందిస్తున్నాడు. రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలను వీక్షించిన కంగనా అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఇదే విషయాన్ని ఆమె ప్రకాష్ కి చెప్పి తాను కూడా డైరెక్ట్ చేస్తానని చెప్పిందట. దానికి ఆయన ఒప్పుకున్నట్లు మీడియా ముందు చెప్పారు. 

సినిమాలో చాలా సన్నివేశాల్లో రాజ్ కుమార్ రావు హైలైట్ అవుతున్నారని ఆమె బాధ పడ్డారని, ఆ సన్నివేశాలన్నీ మళ్లీ తెరకెక్కించాలన్నారని చెప్పారు. ఆమె సెట్స్ లో కేవలం నటిగానే కాకుండా మిగతా విషయాల్లోనూ ఇన్వాల్వ్ అవుతుంటారని, సినిమా బాగా రావాలనే ఉద్దేశంతో ఆమె జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు.

అందులో తప్పు లేదని ప్రకాష్ అన్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు తన దర్శకులకు సూచనలు ఇస్తుంటారని, అలాంటప్పుడు కంగనా ఓ డైరెక్టర్ ని డైరెక్ట్ చేయడంతో తప్పేముందని ప్రశ్నించారు. కేవలం కంగనా విషయంలో అందరూ ఎందుకు షాకవుతున్నారని అడిగారు.