దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి.. బాలీవుడ్ స్క్రీన్ రైటర్ కనిక థిల్లాన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా వీరిద్దరూ తమ వివాహ బంధంలో సంతోషంగానే ఉన్నారు. కనిక బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాలకు కూడా పని చేస్తోంది.

తెలుగులో ఆమె కథ, స్క్రీన్ ప్లే రాసిన 'సైజ్ జీరో' సినిమాకి ఆమె భర్త ప్రకాష్ దర్శకత్వం వహించారు. తాజాగా వీరిద్దరూ కలిసి బాలీవుడ్ లో 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా చేశారు. కనిక స్క్రిప్ట్ అందిస్తే ప్రకాష్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రానప్పటికీ విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కాయి.

ఇప్పుడు బాలీవుడ్ లో ఈ జంట గురించి కొన్ని దారుణమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయని, విడాకులు తీసుకోబోతున్నారని.. కనికకి మరో వ్యక్తితో ఎఫైర్ ఉందని కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్లు వార్తలు ప్రచురించాయి. తాజాగా దియా మీర్జా తన భర్త షాహిల్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనికి కారణం కనిక అని షాహిల్ తో ఆమెకి ఎఫైర్ నడుస్తోందని.. ఆ కారణంగానే షాహిల్ తన భార్యకి దూరమయ్యాడని.. ఇప్పుడు కనిక కూడా తన భర్తని వదిలేయడానికి  సిద్ధమవుతోందని వార్తలు ప్రచురించారు. ఇందులో ఎంతవరకు నిజముందనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ రాఘవేంద్రరావు కోడలి గురించి ఇలాంటి వార్తలు రావడం బాధాకరం.