లాక్ డౌన్, కరోనా తో థియోటర్స్ మూత కారణాలతో మనదేశంలోనూ గత కొంతకాలంగా వెబ్‌ సిరీస్‌లకు మంచి ఆదరణ దొరుకుతోంది.  దీంతో కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వాటికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలుపూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో బాబీ డియోల్‌ కీలక పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఆశ్రమ్‌’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్‌ ఝా డైరక్షన్ లో రూపొందిన ఈ సీరిస్ వివాదాలకు నిలయమవుతోంది.

 అన్ని రంగాలను శాసించే బాబా నిరాలా ఆఫ్‌ కాశీపూర్‌ పాత్రలో బాబీ డియోల్ కనిపించారు. తొలిసారి ఆయన వెబ్‌సిరీస్‌లో నటిస్తుండటం విశేషం. దేవుడి ప్రతినిధిగా నిరాలా బాబాను భక్తులు ఏవిధంగా కొలిచేవారు. ఆయనను ఏవిధంగా అనుసరించేవారు. ఆ ఆశ్రమంలో జరిగిన అత్యాచారం, హత్యల వెనుక ఉన్నది ఎవరు? చివరకు బాబా ఏమయ్యారు? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆశ్రమ్‌’ లో ఉన్నాయి.  ఈ వెబ్‌సిరీస్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

అయితే 'ఆశ్రమం' ద్వారా హిందూ మనోభావాలను రేకెత్తిస్తున్నారనే ఆరోపణలు, దర్శకుడు  ప్రకాష్‌ ఝా పై వస్తున్నాయి.  వ్యతిరేకత తీవ్రమై, సోషల్ మీడియాలో అరెస్టుకు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక సీజన్ పూర్తైంది. ఇప్పుడు మేకర్స్ రెండవ సీజన్ తీసుకువస్తున్నారు. రెండవ సీజన్ వచ్చే నెల నవంబర్ 11 నుండి ప్రసారం కానుంది. ఈ సీరిస్ లో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే బుధవారం ట్విట్టర్‌లో #PrakashJhaAttacksHinduFaith ట్రెండింగ్‌లో ఉంది.  

ఈ హ్యాష్‌ట్యాగ్‌ తో  ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ప్రకాష్ ఝాను వ్యతిరేకిస్తున్నారు. ఈ సీరిస్ దర్శకుడు ప్రకాష్ ఝా హిందువుల మత మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఈ సీరిస్ లో, హిందూ మతానికి చెందిన ధోని బాబాను చూపించడం ద్వారా హిందువులను దుర్భాషలాడుతున్నారని ప్రజలు అంటున్నారు. ఇది కాకుండా, ఈ సిరీస్‌కు ఉద్దేశపూర్వకంగా ఆశ్రమం అని పేరు పెట్టారని ఆరోపిస్తున్నారు.

దేవుడి ప్రతినిధిగా నిరాలా బాబాను భక్తులు ఏవిధంగా కొలిచేవారు. ఆయనను ఏవిధంగా అనుసరించేవారు. ఆ ఆశ్రమంలో జరిగిన అత్యాచారం, హత్యల వెనుక ఉన్నది ఎవరు? చివరకు బాబా ఏమయ్యారు? ఆయనలోకి క్రూరత్వం ఎలా బయటపడింది? తదితర విషయాలు తెలియాలంటే ‘ఆశ్రమ్2‌’ చూడాల్సిందే.