బెల్లంకొండ శ్రీనివాస్ తో జతకట్టిన ప్రగ్యా జైస్వాల్ ద్వారక క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో తెరకెక్కుతున్న మూవీ రకుల్, జైస్వాల్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న బోయపాటి మూవీ
బోయపాటి మార్కు యాక్షన్, ఎమోషన్స్తో సాగే ఈ హై బడ్జెట్ చిత్రంలో ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ను సరికొత్త లుక్లో స్టయిలిష్గా ప్రెజంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
ఈ చిత్రం గురించి చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ - ``మా ద్వారక క్రియేషన్స్ బ్యానర్లో బోయపాటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్తో తన మార్కు ఎంటర్టైన్మెంట్తో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా హై బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చితం ఫస్ట్ షెడ్యూల్ను బోయపాటిశ్రీను, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ సహకారంతో రీసెంట్గా పూర్తి చేశాం. త్వరలో ప్రగ్యాజైశ్వాల్ షూటింగ్లో జాయిన్ అవుతుంది. ఇద్దరి హీరోయిన్స్కు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్రలను దర్శకుడు బోయపాటి శ్రీనుగారు క్రియేట్ చేశారు. మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్,పబ్లిసిటీ డిజైనర్ః ధని ఏలే, ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్ః రామ్లక్ష్మణ్, మాటలుః ఎం.రత్నం, సినిమాటోగ్రఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్రసాద్, నిర్మాతః మిర్యాల రవీందర్ రెడ్డి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వంః బోయపాటి శ్రీను.
