‘బాహుబలి’ 1, 2 సూపర్ హిట్స్ తర్వాత రిలీజ్ కాబోతున్న  ‘సాహో’ చిత్రంపై  అంచనాలు గురించి తెలిసిందే.  ఈ సినిమా అప్ డేట్స్ గురించి రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల  ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ‘సాహో’ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ విడుదలైంది. పోస్టర్‌లో శ్రద్ధ.. ప్రభాస్‌ను చాలా ప్రేమగా  చూస్తున్నట్లుగా ఉంది. 

ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ ఒక్కటి కూడా విడుదల కాకపోవటంతో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తైంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు రూ.150 కోట్లతో సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల 30కి వాయిదా పడింది. 

‘ర‌న్‌ రాజా రన్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడు.  భారీ తారాగణం నటిస్తున్న దీంతో ఇప్పటి వరకు ‘సాహో’ విడుదలను దృష్టిలో పెట్టుకుని వాయిదా పడిన చిత్రాలన్నీ ఈ ఆగస్ట్ 15కు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ ‘రణరంగం’, అడవి శేష్ ‘ఎవరు’ చిత్రాలు ఆగస్ట్ 15న విడుదల అవుతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు.