`రాధేశ్యామ్` సినిమా మార్చి 11న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అంతకంటే ఒక్క రోజుముందే అంటే మార్చి 10న ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈ విషయంలో ప్రభాస్ మరో ఘనత సాధిస్తున్నారు.
ప్రభాస్(Prabhas) ఇప్పటికే అనేక ఘనతలు సాధించారు. పాన్ ఇండియా స్టార్‌గా, పాన్ వరల్డ్ గా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాలు సైతం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. అంతేకాదు వరుసగా ఆరు పాన్ ఇండియా చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఇండియన్ సినిమాలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగానూ నిలిచారు. ఇప్పుడు ఆయన ఖాతాలో మరో రికార్డ్ చేరబోతుంది. ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్`(Radheshyam) చిత్రం అమెరికాలో రికార్డ్ స్థాయిలో విడుదల కాబోతుంది.
`రాధేశ్యామ్` సినిమా మార్చి 11న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అంతకంటే ఒక్క రోజుముందే అంటే మార్చి 10న ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈ విషయంలో ప్రభాస్ మరో ఘనత సాధిస్తున్నారు. ఈ సినిమాని యూఎస్‌లో గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ రిలీజ్ చేస్తుంది. 1116 లొకేషన్లలో, 3116 స్క్రీన్లలో, 11116 షోస్‌ని వేయబోతున్నారు. ఒకే రోజు ఒకే హీరోకి చెందిన సినిమా ఈ స్థాయిలో ప్రదర్శించబడటం ఇదే ఫస్ట్ టైమ్ అని తెలుస్తుంది. ఆ రోజు మరే సినిమానే లేదని, వన్ స్టార్, వన్ రిలీజ్ అంటూ చిత్ర బృందం ప్రకటించింది. అంటే Radheshyam సింగిల్ రిలీజ్‌తో మార్చి 10న Prabhas అమెరికాని షేక్ చేయబోతున్నారని చెప్పొచ్చు.
ఇక ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన `రాధేశ్యామ్` చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా ఇది మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని 20వేల స్క్రీన్లలో విడుదలచేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా నిలవబోతుంది.
ఈ సినిమా విధికి, ప్రేమకి మధ్య ఫైటింగ్ నేపథ్యంలో సాగుతుందని టాక్. పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ హస్త జాతకుడిగా కనిపించబోతున్నారు. పూజా హెగ్డేతో తన ప్రేమ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది. ఎలాంటి డ్రామా చోటు చేసుకుందనేది ఆసక్తికరంగా ఉండబోతుందని, ఇదొక విజువల్ ఫీస్ట్ గా నిలవబోతుందని చిత్ర బృందం చెబుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్స్ ని చూస్తే అర్థమవుతుంది. మరోవైపు సినిమా రిలీజ్‌కి దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్. త్వరలో సినిమా నుంచి మరో ట్రైలర్ రాబోతుందట.
