టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ నలభైకి దగ్గర పడుతున్నా పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగాఅభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ పెళ్లి చేసుకోవడం ఖాయమని పలు వెబ్ సైట్లు వార్తలు ప్రచురిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ వెబ్ పోర్టల్ సంస్థ ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రత్యేకత ఏంటంటే.. ప్రభాస్ సోదరి ప్రగతి ఉప్పలపాటి స్వయంగా తన అన్నయ్య పెళ్లి గురించి చెప్పిందంటూ వార్త రాసుకొచ్చింది. 

ఓ ఇంటర్వ్యూలో ప్రగతి.. తన అన్నయ్య ప్రభాస్ పెళ్లి గురించి కామెంట్స్చేసిందని... ప్రముఖ ఎన్నారై బిజినెస్ మెన్ కూతురితో ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆమె చెప్పినట్లు వార్తలు ప్రచురించారు. ఇదే వార్తను అన్ని మీడియా వర్గాలు కవర్ చేశాయి. అయితే ప్రగతి ఎప్పుడు ఈ కామెంట్స్ చేసిందనే విషయంలో మాత్రం స్పష్టం లేదు. టాలీవుడ్ లో కూడా ఈ వార్తలు చక్కర్లు కొడుతోంది.

అయితే ప్రగతి అలాంటి కామెంట్స్ చేయలేదని.. ఆమె బాలీవుడ్ లో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదని కొందరు అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయాన్ని ప్రభాస్ ఫ్యామిలీ చెబితేనే కానీ క్లారిటీ రాదు.