బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోన్న ద్విభాషా చిత్రం సాహో. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని సినిమాకు సంబందించిన వార్తలు అభిమానుల్లో అంచనాలను తారా స్థాయికి చేర్చుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ నుంచి వస్తోన్న ఒక డిఫరెంట్ యాక్షన్ మూవీ కావడంతో సినిమాపై రూమర్స్ కూడా అలానే వస్తున్నాయి. 

అయితే రీసెంట్ గా వచ్చిన కొన్ని అబద్దపు ప్రచారాలకు రెబల్ స్టార్ అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే చిత్ర యూనిట్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసింది. కొన్ని సీన్స్ విషయంలో చాలా వరకు ప్రభాస్ సంతృప్తిగా లేడని ఆ సన్నివేశాలను రీషూట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడంతో ప్రభాస్ విచారం వ్యక్తం చేసినట్లు టాక్. 

అదే విధంగా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని కథనాలు వెలువడటంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురయ్యారు. వెంటనే చిత్ర యూనిట్ ఈ కథనాల్లో ఎలాంటి నిజం లేదని సమాధానమిచ్చింది. ఇక సినిమా రిలీజ్ కూడా ఆగస్ట్ లోనే ఉంటుందని వివరణ ఇచ్చారు.