Asianet News TeluguAsianet News Telugu

రియల్‌ లైఫ్‌లో వరదరాజా మన్నార్‌కి దేవా చేసిన సాయం ఏంటో తెలుసా?

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ `సలార్‌` సినిమాలో స్నేహితులుగా నటించిన తమ స్నేహాన్ని చాటుకున్నారు. అంతేకాదు ఇప్పుడు రియల్‌ లైఫ్‌లోనూ తమ స్నేహాన్ని చాటుకున్నారు.

prabhas unveiled First Look Poster of Prithviraj Sukumaran The Goat Life arj
Author
First Published Jan 10, 2024, 8:57 PM IST

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కలిసి `సలార్‌` నటించారు. ఈ ఇద్దరి మధ్య స్నేహం బాగా హైలైట్‌ అయ్యింది. ఇందులో ప్రభాస్ దేవగా కనిపిస్తే, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వరదరాజా మన్నార్‌ గా కనిపించారు. సినిమాలో ఈ ఇద్దరు స్నేహితులు. వరద రాజా మన్నార్ కోసం దేవా ఏం అయినా చేయడానికి సిద్ధం. రాజ్యం అప్పగించేందుకే వస్తాడు. సినిమాలోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ వరదరాజా కోసం అండగా నిలిచాడు ప్రభాస్‌. ఆయన సినిమాకు ప్రభాస్‌ తన వంతు సపోర్ట్ ని అందించారు. 

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. ప్రస్తుతం మలయాలంలో `ది గోట్‌ లైఫ్‌` అనే సినిమాలో నటిస్తున్నారు. పూర్తి రా అండ్‌ రస్టిక్‌ కంటెంట్‌తో ఈ మూవీ రూపొందుతుంది.ఇందులో పృథ్వీరాజ్‌ లుక్‌ భయంకరంగా, గుర్తు పట్టలేనంతగా ఉంది. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో టైటిల్‌ని, ఫస్ట్ లుక్‌ని ప్రభాస్‌ చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా తన స్నేహితుడు పృథ్వీరాజ్‌కి డార్లింగ్ విషెస్‌ తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈ మూవీ ఒక్కసారిగా తెలుగులో ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

తెలుగులో ఈ మూవీని `ది గోట్‌ లైఫ్‌`(ఆడు జీవితం) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏప్రిల్ 10న "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.  

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ , నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. ఐదేళ్లు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)  సినిమా కోసం కేటాయించాను. మానసికంగా, శారీరకంగా నజీబ్ క్యారెక్టర్ లా మారిపోయాను. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ మూవీ కోసం రాజీ లేకుండా కష్టపడ్డాను. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాకు పనిచేస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో, రేపు థియేటర్స్ లోనూ ప్రేక్షకులు కూడా అంతే హ్యాపీగా ఫీలవుతారు` అని చెప్పారు.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు.  ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios