నీహారిక కోసం ప్రభాస్.. ఏం చేస్తున్నాడంటే..?

prabhas to be chief guest for niharika's happy wedding movie
Highlights

హారిక కోసం ప్రభాస్ అతిథిగా ఓ వేడుకకు హాజరు కానుండడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. నీహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించిన చిత్రం 'హ్యాపీ వెడ్డింగ్'. 

కొద్దిరోజుల క్రితం మెగాడాటర్ నీహారికను ప్రభాస్ కు ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. దాదాపు అన్ని మీడియా వర్గాలు ఈ విషయాన్ని ప్రచురించాయి. ఈ విషయంపై స్పందించిన ఇరు కుటుంబ సభ్యులు అందులో ఎలాంటి నిజం లేదని తేల్చేశారు. దీంతో ఆ వార్తలకు కాస్త ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇప్పుడు నీహారిక కోసం ప్రభాస్ అతిథిగా ఓ వేడుకకు హాజరు కానుండడం హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయంలోకి వస్తే.. నీహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించిన చిత్రం 'హ్యాపీ వెడ్డింగ్'. ఈ సినిమాను ప్రభాస్ సన్నిహితుల నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 21న జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరు కానున్నాడని సమాచారం. అలానే మెగాస్టార్ చిరంజీవి కూడా తన కూతురు కోసం ముఖ్య అతిథిగా రానున్నాడట. ఇప్పటికే యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్-చిరులను ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ ఇద్దరు స్టార్లు ఒకే వేదికపై కనిపిస్తే సినిమాకు మరింత హైప్ పెరగడం ఖాయం.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఎలా ఉందొ చూడాలంటే ఈ నెలాఖరు వరకు ఎదురుచూడాల్సిందే!

loader