టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్.. నటి అనుష్కతో ప్రేమాయణం సాగిస్తున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ జంట ఎప్పటికప్పుడు ఆ వార్తలను కొట్టి పడేస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు.

టాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ విషయమై ప్రభాస్ ని తన షోలో ప్రశ్నించాడు. దానికి ప్రభాస్ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. కరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'కాఫీ విత్ కరణ్' షోలో ప్రభాస్ తో పాటు రానా, రాజమౌళిలు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కరణ్.. ప్రభాస్ ని ప్రశ్నిస్తూ.. 'నువ్వు దేవసేన అనుష్కతో డేటింగ్ లో ఉన్నావని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమా..? కాదా..?'' అని అడగగా.. దానికి ప్రభాస్ 'లేదు' అన్నారు. 'కానీ గుసగుసలు వినిపిస్తున్నాయి కదా..' అని ప్రభాస్ అడగగా.. 'ఇవి మొదలుపెట్టింది మీరే' అని చమత్కరించాడు. 

ఆ తరువాత కరణ్.. ప్రభాస్ ని 'నాకు అబద్ధాలు చెప్పావు కదూ..' అని అడగగా 'అవును' అని చెప్పడంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. 'బాహుబలి' రెండు భాగాలను హిందీలో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై   విడుదల చేశారు.