Asianet News TeluguAsianet News Telugu

పారితోషికంలో 20 శాతం మాత్రమే తీసుకున్నా.. ప్రభాస్ కామెంట్స్!

సాహో కోసం మేం అనుకున్న బడ్జెట్ కంటే దాదాపు రెట్టింపు అయింది. సినిమా కోసం దాదాపు 350 కోట్లు ఖర్చు అయింది. పైగా నిర్మాతలంతా నా ఫ్రెండ్స్, మేమంతా కలిసి పెరిగాం. అలాంటప్పుడు నేనెలా ఫుల్ పేమెంట్ తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్. 
 

Prabhas Takes 20% Pay Cut for Saaho After Baahubali
Author
Hyderabad, First Published Aug 17, 2019, 12:59 PM IST

సినిమా సక్సెస్ అయితే మన తారలు రెమ్యునరేషన్ పెంచేస్తూ ఉంటారు. తమకు క్రేజ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలనే ధోరణిలో ఆలోచిస్తుంటారు. 'బాహుబలి' లాంటి భారీ సినిమా తరువాత ప్రభాస్ కూడా తన రెమ్యునరేషన్ పెంచేశాడని వార్తలు వినిపించాయి. 'సాహో'కి భారీగా రెమ్యునరేషన్ తీసుకొని ఉంటాడని అంతా భావించారు. తాజాగా ఈ విషయంపై ప్రభాస్ స్పందించారు.

అంతా ఊహించినట్లు తను రెమ్యునరేషన్ పెంచలేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఒక ట్విస్ట్ కూడా ఇచ్చాడు. 'సాహో' సినిమాకి రెగ్యులర్ తీసుకునే పారితోషికం కూడా తీసుకోలేదట. 'సాహో' సినిమా కోసం చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నానని ప్రభాస్ చెప్పాడు. బాహుబలి సినిమా తరువాత రెమ్యునరేషన్ పెంచేశారని అందరూ అనుకుంటున్నారని.. అందులో నిజం లేదని చెప్పిన ప్రభాస్.. 'సాహో' సినిమా కోసం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైందని చెప్పారు.

 దాదాపు రూ.350 కోట్లు ఖర్చు పెట్టారని.. నిర్మాతలంతా తన స్నేహితులని.. కలిసి పెరిగామని.. అలాంటప్పుడు ఫుల్ పేమెంట్ ఎలా తీసుకుంటానని అడిగారు. వాళ్లు అంత ఖర్చు పెట్టినట్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోలేనని.. అందుకే తన పారితోషికంలో 20 శాతం మాత్రమే తీసుకున్నానని చెప్పారు.

అంటే కోటి రూపాయలు తీసుకునే దగ్గర 20 లక్షలు మాత్రమే చార్జ్ చేశారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ చాలా తక్కువ రెమ్యునరేషన్ కి 'సాహో' సినిమా చేశారని చెప్పాలి. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios