‘బాహుబలి’ తో ఎంతో ఎత్తుకు ప్రభాస్ ఇమేజ్ వెళ్లిపోయింది. దేశ‌వ్యాప్తంగా అత‌డికి పాపులారిటీ కు తిరిగులేదని సాహో కు వస్తున్న క్రేజ్ చెప్తోంది. బాహుబ‌లి రెండు భాగాలు ఏ స్థాయి విజ‌యాలు సాధించాయో అంతకు మించి ఇప్పుడు సాహోతో టార్గెట్ ఫిక్సైంది. ఆ ఊపు త‌గ్గకుండా చూసుకోవాల్సిన భాధ్యత ప్రభాస్ పై ఉంది. అందులో బాహుబలి తర్వాత సాహో లాంటి ఈ మెగా ప్రాజెక్టు చేశాడు. ఇప్పటిదాకా రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ చూస్తూంటే పెద్ద హిట్టే అయ్యేలా క‌నిపిస్తోంది. ప్రి రిలీజ్ బ‌జ్ అయితే అంచనాలను ఆకాశానికి సెట్ చేసేసింది. ఈ నేపధ్యంలో ప్రభాస్ ఏ మేరకు రిస్క్ చేసాడు అనేది మాట్లాడుకోవాల్సిన అంశం గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ప్రబాస్ ఈ సినిమాకోసం తన రెమ్యునేషన్ లో ఇరవై శాతం తగ్గించుకుని దాన్ని మేకింగ్ మీద పెట్టమని సూచించాడట. ఆ మేరకు రిస్క్ ను తను భరిస్తానని చెప్పారట. ప్రభాస్ అలా తన వాటా రెమ్యునేషన్ తగ్గించుకోవటంతో నిర్మాతలు రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమాపై ఖర్చు పెట్టారు. అదే ప్రభాస్ నాకు సంభందం లేదన్నట్లు ఉండిపోతే ఈ స్దాయి సినిమా వచ్చేది కాదంటున్నారు. ఎందుకంటే బాహుబలితో ప్రభాస్ ఓ మార్క్ సెట్ చేసేసారు. దాన్ని దాటాలి లేదా దాన్ని రీచ్ అయినా అవ్వాలి. లేకపోతే సినిమా ఎంత గొప్పగా ఉన్నా ...కష్టమని తేల్చేస్తారు. ఇదంతా ప్రబాస్ ఈ ప్రాజెక్టుతో తీసుకున్న రిస్కే. 

తెలుగుతో పాటు ఒకేసారి హిందీ.. తమిళం.. మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీ ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలా అనిపించకుండా డైరెక్ట్ మూవీ అనిపించే ఫీల్ కోసం ట్రై చేస్తున్నారు . తెలుగు తర్వాత ‘సాహో’ టీం టార్గెట్ చేసిన మార్కెట్ బాలీవుడ్డే. ఇందుకోసమే శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముకేశ్, జాకీష్రాఫ్ లాంటి నటీనటుల్ని.. శంకర్-ఎహసాన్-లాయ్ లాంటి సంగీత దర్శకుల్ని ఈ చిత్రం కోసం తీసుకున్నారు.

అక్కడితో ఆగకుండా ‘సాహో’ సినిమాకు ప్రభాస్ హిందీలోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇందుకోసం అతను హిందీలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. తనకు హిందీ మాట్లాడటం, రాయడం వచ్చినప్పటికీ లోకల్ వాళ్లలా ఆ భాష మాట్టాడేందుకు కష్టపడుతున్నానని ప్రభాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.  ఇవన్నీ ధైర్యం చేసి చేసిన రిస్క్ లే. వర్కవుట్ అయ్యాయా..ప్రభాస్ ని ఎక్కడికో తీసుకెళ్లి నిలబెడతాయి.