బాహుబలితో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ప్రభాస్ తదుపరి చిత్రం సాహో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సాహో కు హీరోయిన్ కరవు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ప్రభాస్ నేషనల్ లెవెల్ లో సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు. ఫలానా ఇండియన్ సినిమా తెగ ఆడేస్తోందనే వార్తలతో విదేశీయులు కూడా ఈ చిత్రాన్ని పెద్ద సంఖ్యలో వీక్షిస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ప్రతిష్టించుకున్న తొలి దక్షిణ భారత నటుడిగా ప్రభాస్ కీర్తి గడించాడు. వెయ్యి కోట్లకి పైగా వసూళ్లతో భారతీయ చలన చిత్ర చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించిన బాహుబలి 2 హీరో చిత్రమంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ ప్రభాస్ తదుపరి చిత్రానికి ఇంతవరకు హీరోయిన్ సెట్ కాలేదు.
ప్రభాస్ 'సాహో' చిత్రం త్వరలో సెట్స్ మీదకి వెళ్లనుంది కానీ హీరోయిన్‌ని ఖరారు చేసుకోలేదు. హిందీ, తమిళ భాషల్లోను విడుదల చేయబోతున్నారు కనుక ఇండియా అంతటా పేరున్న హీరోయిన్‌ని తీసుకోవాలని చూస్తున్నారు. అయితే బాలీవుడ్ టాప్ రేటెడ్ హీరోయిన్లు ఎవరూ సౌత్ సినిమాలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు.
బాహుబలి హీరో అన్నా కానీ వారు బాలీవుడ్ చిత్రాలని దాటి సౌత్‌కి రావడానికి ఇష్టపడడం లేదు. కేవలం ప్రభాస్ పేరు మీద సాహోని నేషనల్ బ్రాండ్‌గా మార్చడం జరిగే పని కాదు కనుక ఎవరైనా టాప్ బాలీవుడ్ హీరోయిన్‌కి ఎంత ఇచ్చి అయినా తీసుకుందామని చూస్తున్నారు. మరి ఫైనల్‌గా సాహో సరసన నటించే ఆ బాలీవుడ్ భామ ఎవరో...
